close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అందరూ ఉన్నా అద్దె ఇంట్లో అనాథగా..

కొవిడ్‌తో పూజారి కన్నుమూత

వనపర్తి, న్యూస్‌టుడే: కరోనా సోకిన వ్యక్తిని సొంత కుటుంబసభ్యులే అద్దె ఇంట్లో ఉంచారు. చివరకు ఆ వ్యక్తి అనాథగానే మృతి చెందారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని రాంనగర్‌కాలనీ 11వ వార్డులోని ఓ ఇంట్లో నాలుగు రోజుల క్రితం ఓ వ్యక్తి(39) అద్దెకు దిగారు. ఒక్కరే ఉండటం, రోజూ కుటుంబసభ్యులు వచ్చిపోతుండటంతో చుట్టుపక్కల వారు అడగగా.. ఇంకా సామాన్లు సర్దుతున్నామని దాటవేశారు. మంగళవారం అద్దెకు ఉన్న వ్యక్తిని వారు ఎంతపిలిచినా పలకక పోవడంతో పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. ఇద్దరు పోలీసులు వచ్చి పరిశీలించి.. అప్పటికే చనిపోయినట్లుగా గుర్తించారు. ఆయన వివరాలు ఆరాతీయగా.. జిల్లా కేంద్రంలోని ఓ దేవాలయంలో కొంతకాలం పూజారిగా పని చేశారని, అక్కడే రెండు సొంత ఇళ్లు ఉన్నాయని.. పెళ్లయి పిల్లలు ఉన్నారని గుర్తించారు. కరోనా సోకడంతో కుటుంబసభ్యులే అద్దె ఇంట్లో ఉంచారని భావిస్తున్నారు. మరణ సమాచారం ఇచ్చినా.. కుటుంబసభ్యులు ఎవరూ రాకపోవడంతో పురపాలక సంఘం వారే శవాన్ని తరలించి ఖననం చేశారు. ఆయన సోదరుడిగా చెబుతున్న ఓ వ్యక్తి మాత్రమే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు