ఆర్టీసీ రాబడిరూ.1.37 కోట్లే
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్టీసీ రాబడిరూ.1.37 కోట్లే

ఈనాడు, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ విధించిన బుధవారం రోజు ఆర్టీసీకి కేవలం రూ.1.37 కోట్లే రాబడి వచ్చింది. రోజు వారీగా రూ.13 కోట్ల వరకు రాబడి రావాల్సి ఉంది. మామూలుగా రోజూ 35 లక్షల కిలోమీటర్ల వరకు బస్సులు రాకపోకలు సాగిస్తాయి. అలాంటిది బుధవారం కేవలం 4.9 లక్షల కిలోమీటర్లే నడిచాయి. ఇంత భారీగా మొత్తంలో రాబడి పడిపోవటం.. కిలోమీటర్లు తగ్గటం ఇదే ప్రథమం. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు వెసులుబాటు కల్పించగా ఆ సమయాల్లో మాత్రమే సిటీ, జిల్లా సర్వీసులను నడపాలని సంస్థ నిర్ణయించింది.  ఉపాధి కోసం వలస వచ్చిన వారంతా లాక్‌డౌన్‌ కారణంగా తమతమ జిల్లాలకు వెళ్లేందుకు భారీగా తరలి రావటంతో సమయం మించినా ఆర్టీసీ బస్సులు నడిపింది.  రాష్ట్ర ఆర్టీసీ కార్యాలయాలు, గ్యారేజీలు, వర్క్‌షాపులు యథాతథంగా పని చేస్తాయని మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌శర్మ ఉత్తర్వులు చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు