‘నాట్కో’ రూ.4.20 కోట్ల మాత్రల విరాళం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నాట్కో’ రూ.4.20 కోట్ల మాత్రల విరాళం

మంత్రి కేటీఆర్‌కు అందజేత

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా నియంత్రణ కోసం ప్రముఖ ఔషధ సంస్థ నాట్కో ఫార్మా లిమిటెడ్‌ ట్రస్టు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.4.20 కోట్ల విలువైన లక్ష బారియంట్‌(బారిసిటినిబ్‌) మాత్రలను విరాళంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన లేఖను నాట్కో సీఈవో రాజీవ్‌ నన్నపనేని శుక్రవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీ రామారావుకు అందజేశారు. కరోనా నుంచి కోలుకోవడానికి రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లతో కలిసి 4 ఎంజీ బారియంట్‌ మాత్రలను వాడుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు వైద్యుల సూచనల మేరకు వినియోగించుకునేందుకు వీటిని అందజేస్తున్నట్లు రాజీవ్‌ తెలిపారు. ఈ సందర్భంగా నాట్కో సంస్థను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, ఇతర అధికారులు, నాట్కో ప్రతినిధులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు