కల్తీ రహిత విత్తన భాండాగారంగా తెలంగాణ
close

ప్రధానాంశాలు

కల్తీ రహిత విత్తన భాండాగారంగా తెలంగాణ

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: కల్తీ రహిత విత్తన భాండాగారంగా రాష్ట్రం రూపొందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల అధికారులతో మాట్లాడారు. టాస్క్‌ఫోర్స్‌ దాడులతో నకిలీ విత్తనాల తయారీదారుల్లో వణుకు పుట్టిందన్నారు. ఈ సీజన్‌లో 177 కేసులు నమోదు చేసి 276 మందిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. పీడీ చట్టం కింద 32 కేసులు నమోదు చేశామని, పదే పదే అక్రమాలు చేస్తున్న వారంతా పొరుగు రాష్ట్రాల వారేనని తెలిపారు. కేసులు పెట్టినా మారని వారిపై ప్రధానంగా దృష్టిపెట్టాలని పోలీసులకు సూచించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని