సామాన్య భక్తులకు సులభంగా వసతిగదుల కేటాయింపు
close

ప్రధానాంశాలు

సామాన్య భక్తులకు సులభంగా వసతిగదుల కేటాయింపు

నూతన రిజిస్ట్రేషన్‌ కేంద్రాలను ప్రారంభించిన తితిదే అదనపు ఈవో

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వసతి గదుల నమోదు (రిజిస్ట్రేషన్‌) కేంద్రాల ద్వారా సామాన్య భక్తులు సులభంగా గదులు పొందవచ్చని తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. శనివారం స్థానిక సీఆర్వో కార్యాలయంవద్ద ఆయన పూజలు నిర్వహించి నూతన కేంద్రాలను ప్రారంభించారు. తిరుమలలో ఇప్పటి వరకు సీఆర్వో కార్యాలయం వద్ద భక్తులు పేర్లు నమోదు చేసుకుంటే అద్దె గదులు కేటాయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటం, పార్కింగ్‌ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. సులభంగా గœదుల కేటాయింపునకు తిరుమలలోని సీఆర్వో కార్యాలయం, బాలాజీ మెయిన్‌ బస్టాండ్‌, కౌస్తుభం అతిథి భవనం సమీపంలోని కార్‌ పార్కింగ్‌ వద్ద, రాంభగీచ బస్టాండ్‌, ఎంబీసీ ప్రాంతంలోని శ్రీవారి మెట్టు, జీఎన్‌సీ టోల్‌గేట్‌ సమీపంలో ఉన్న లగేజీ కౌంటర్‌వద్ద రెండేసి చొప్పున ఏర్పాటు చేసిన కేంద్రాల్లో భక్తులు పేర్లను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పేర్లు నమోదు చేసుకున్న వారికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా కేటాయించిన గదుల సమాచారం తెలియజేస్తామన్నారు. అద్దెగదులను కరెంట్‌ బుకింగ్‌ చేసుకునే భక్తుల నుంచి కాషన్‌ డిపాజిట్‌ తీసుకోవడంపై ఈనెల 14న సంబంధిత అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ధర్మారెడ్డి పేర్కొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని