పూర్తిస్థాయిలో పాస్‌పోర్టు సేవలు
close

ప్రధానాంశాలు

పూర్తిస్థాయిలో పాస్‌పోర్టు సేవలు

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని పాస్‌పోర్టు సేవాకేంద్రాలు, సేవా లఘు కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌ లోని బేగంపేట, అమీర్‌పేట, టోలిచౌకితోపాటు నిజామాబాద్‌లోని పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, కరీంనగర్‌లోని లఘు కేంద్రంలో సగం అపాయింట్‌మెంట్లు మాత్రమే అందుబాటులో ఉంచగా, ప్రస్తుతం పూర్తిస్థాయిలో అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, మెదక్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, మేడ్చల్‌, భువనగిరి, వికారాబాద్‌, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, కామారెడ్డిలోని సేవాకేంద్రాల్లో ఈ నెల 10 నుంచి సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని