అవయవమార్పిడిలో అరుదైన ఘనత

ప్రధానాంశాలు

అవయవమార్పిడిలో అరుదైన ఘనత

 500 శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేసిన డాక్టర్‌ జ్ఞానేష్‌ టక్కర్‌

ఈనాడు, హైదరాబాద్‌: అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు కత్తిమీద సాము లాంటివి. చిన్నపాటి అజాగ్రత్త తలెత్తినా.. ప్రాణాలకే ముప్పు. అలాంటి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేయడంలో డాక్టర్‌ జ్ఞానేష్‌ టక్కర్‌ది అందెవేసిన చేయి. ఏకంగా 500 వరకు గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన ఘనత ఆయన సొంతం. మృత్యుముఖం వరకు వెళ్లిన ఎంతోమంది రోగులకు గత 34 ఏళ్ల వృత్తి జీవితంలో ఆయన పునర్జన్మ ప్రసాదించారు. గుజరాత్‌కు చెందిన టక్కర్‌.. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రఖ్యాత ఆసుపత్రుల్లో పనిచేశారు. అమెరికాలో ప్రముఖ డాక్టర్లలో ఒకరిగా కొనసాగుతుండగానే మాతృభూమికి సేవలందించాలని తిరిగి వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. 500 గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా బుధవారం ఆసుపత్రిలో తోటి వైద్యులు, సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించి, సేవలను కొనియాడారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని