ఇంటర్‌ పరీక్షల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ

ప్రధానాంశాలు

ఇంటర్‌ పరీక్షల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. పరీక్షలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక కోర్టుకు రావడాన్ని ప్రశ్నించడంతో పిటిషనర్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరంలో ఉన్న విద్యార్థులకు మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి శుక్రవారం భోజన విరామ సమయంలో విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరంతో పాటు మొదటి సంవత్సరం పాఠాలు కూడా చదవాలంటే గందరగోళానికి గురవుతారన్నారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్‌ తెలిపారు. గత ఏడాది మొదటి సంవత్సరం మార్కుల ఆధారంగా రెండో సంవత్సరం విద్యార్థులకు మార్కులు కేటాయించామన్నారు. ప్రస్తుతం ఈ విద్యార్థులు పదో తరగతి పరీక్షలు కూడా రాయలేదని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ దశలో జోక్యం చేసుకోలేమని చెప్పడంతో పిటిషనర్‌ తరఫు న్యాయవాది పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.


‘విద్యార్థులూ.. ఒత్తిడిని జయించండి’

ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు ఈనెల 25 నుంచి మొదలవుతున్నందున ఒత్తిడి, పరీక్షల భయాన్ని జయించేందుకు సైకాలజిస్టుల సహకారం తీసుకోవాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో విద్యార్థులకు సూచించారు. ఏడుగురు క్లినికల్‌ సైకాలజిస్టులను సిద్ధంగా ఉంచామని, వారికి ఫోన్లు చేసి సమస్యలకు పరిష్కారం పొందాలని తెలిపారు.

సైకాలజిస్టులు...ఫోన్‌ నంబర్లు

పి.జవహర్‌లాల్‌ నెహ్రూ- 9154951699, అనిత ఆరె- 9154951704, రజని తెనాలి- 9154951695, ఎస్‌.శ్రీలత- 9154951703, శైలజ పీసపాటి- 9154951706, అనుపమ- 9154951687, మజ్హర్‌ అలి- 9154951977


 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని