close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తోరణం కాదు.. గిజిగాడి గూళ్లు

పై చిత్రాన్ని చూస్తే ఏదో తోరణం కట్టినట్టు కనిపిస్తుంది కదా.. కానీ అది కాదు.. నివాసం కోసం కరెంటు తీగలపై గిజిగాడు అనే పిచ్చుకల జాతి పక్షులు నిర్మించుకున్న గూళ్లు అవి. ఈ జాతి పిచ్చుకలు నివాసం, రక్షణ కోసం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటాయి. ముళ్ల చెట్లపై, ఎవరూ ఎక్కని కొమ్మలపై గూళ్లను నిర్మించుకుంటాయి. ఇక్కడ మరింత జాగ్రత్తగా నీటి కుంట పైనుంచి వెళ్లే కరెంటు తీగలపై కట్టుకున్నాయి. ఇది నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం కడ్తాల్‌ గ్రామ శివారులో కనిపించింది.

- న్యూస్‌టుడే, నిర్మల్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు