దానాపూర్‌: ఆనా.. జానా..
close

ప్రధానాంశాలు

దానాపూర్‌: ఆనా.. జానా..

బిహార్‌లో ఉపాధి కరవవడంతో ఆ రాష్ట్రానికి చెందిన ఎంతోమంది కార్మికులు గతంలో పొట్టచేతపట్టుకొని తెలంగాణకు వచ్చారు. ప్రస్తుతం కరోనా ప్రభావం, లాక్‌డౌన్‌ కారణంగా ఇక్కడ పనులు లేకపోవడంతో వారు తిరిగి స్వరాష్ట్రానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బిహార్‌లోనూ ఇవే పరిస్థితులు నెలకొనడంతో అక్కడి వారూ తెలంగాణ బాట పడుతున్నారు. దీనికి అద్దం పట్టేవే ఈ చిత్రాలు. మొదటి చిత్రంలో... శనివారం వేకువజామున సికింద్రాబాద్‌ నుంచి పట్నాకు వెళ్లే దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ కోసం శుక్రవారం రాత్రే వందలాది కార్మికులు సికింద్రాబాద్‌ రైల్వే ప్రాంగణానికి చేరుకుని నిద్రిసుండడాన్ని చూడవచ్చు. మరోవైపు అక్కడ ఉపాధి పరిస్థితులు బాగాలేవంటూ మరికొందరు కార్మికులు శుక్రవారం రాత్రి బిహార్‌ నుంచి అదే దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో నగరానికి చేరుకున్నారు. వీరిని  రెండో చిత్రంలో చూడవచ్చు. ఈ రెండు దృశ్యాలు ఉపాధి లేక అల్లాడుతున్న కార్మికుల దీనావస్థకు దర్పణం పడుతున్నాయి.

-ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని