ఆసక్తిరేపుతున్న ఫౌజీ టీజర్‌..
close

Published : 26/10/2020 23:35 IST
ఆసక్తిరేపుతున్న ఫౌజీ టీజర్‌..

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో చైనా యాప్‌లపై నిషేధం విధించిన తర్వాత దేశీయ యాప్స్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో పబ్‌జీకి ప్రత్యామ్నాయంగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఫౌజీ (ఫియర్‌లెస్‌ అండ్‌ యునైటెడ్‌ గార్డ్స్‌) పేరుతో మల్టీ ప్లేయర్‌ గేమ్‌ను తీసుకొస్తున్నట్లు గతంలో ప్రకటించారు. తాజాగా గేమ్‌కు సంబంధించిన టీజర్‌ను విజయదశమి పండుగ  సందర్భంగా ఆయన ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ఒక నిమిషం నిడివి ఉన్న టీజర్‌లో గల్వాన్‌ లోయలో భారత్‌-చైనాల మధ్య జరిగిన ఘటన ఆధారంగా రూపొందించిన సన్నివేశాలను చూపించారు. ఇందులో భారత ఆర్మీ జవాన్లు బ్రాలర్‌ మెకానిక్స్‌ ద్వారా చైనా సైనికులతో పోరాడుతున్న దృశ్యాలు టీజర్‌లో హైలెట్‌గా నిలిచాయి. ‘‘మన సైనికులు ధైర్యవంతులు, దేశాన్ని సరిహద్దుల్ని రక్షించేందుకు మనం కలిసిపోరాడుతాం..కలిసికట్టుగా దేశాన్ని కాపాడుతాం..మనం ఫౌజీలం’’ అని టీజర్‌లో పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్‌ భారత్ పిలుపులో భాగంగా ఫౌజీని తీసుకొస్తున్నట్లు అక్షయ్‌ కుమార్ గతంలో ప్రకటించారు. ఈ గేమ్‌ కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా మన దేశ సైనికుల త్యాగాలని కూడా దీని ద్వారా తెలియజేయబోతున్నట్లు వెల్లడించారు. ఫౌజీని బెంగళూరుకి చెందిన ఎన్‌కోర్ గేమ్స్‌ అనే సంస్థ రూపొందించింది. అక్షయ్‌ కుమార్ దీని మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల చివరి వారంలో ఫౌజీని విడుదలచేయనున్నట్లు సమాచారం. ఏడాదిలో ఫౌజీని 20 కోట్ల మందికి చేరువ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎన్‌కోర్ సంస్థ తెలిపింది. అంతేకాకుండా ఈ గేమ్ ద్వారా సమకూరే ఆదాయంలో 20 శాతం ‘భారత్‌కా వీర్‌ ట్రస్ట్‌’కు అందజేయనున్నట్లు అక్షయ్ గతంలోనే ప్రకటించారు. టీజర్‌ చూసిన పలువురు గేమర్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. గేమ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న