రెడ్‌మీ కొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్.. ధరెంతంటే?
close

Updated : 11/09/2020 18:59 IST
రెడ్‌మీ కొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్.. ధరెంతంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత బిజీ ప్రపంచంలో స్మార్ట్ గ్యాడ్జెట్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా లైఫ్‌స్టైల్ గ్యాడ్జెట్స్‌ ఉన్న క్రేజ్‌ గురించి కొత్తగా చెప్పుకోనవసరం లేదు. అందుకే గ్యాడ్జెట్‌ తయారీ కంపెనీలు కొత్త ఉత్పత్తులతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా రెడ్‌మీ కొత్త మోడల్ వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌ విడుదల చేసింది. నెక్‌బ్యాండ్ స్టైల్‌ డిజైన్‌తో తీసుకొస్తున్న ఈ ఇయర్‌ఫోన్స్‌లో స్ల్పాష్‌, స్వెట్ రెసిస్టెన్స్‌ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

రెడ్‌మీ సోనిక్‌బాస్‌ పేరిట తీసుకొస్తున్న ఈ ఇయర్‌ఫోన్స్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 12 గంటల పాటు మ్యూజిక్‌ వినవచ్చు. 5.0 బ్లూటూత్ కనెక్టివిటీ, నాయిస్‌ కాన్సిలేషన్‌, ప్రో బాస్‌ ఫీచర్స్‌ ఉన్నాయి. ఎక్సర్‌సైజ్‌, జాగింగ్ లాంటివి చేసేప్పుడు ధరించేందుకు వీలుగా దీనిని డిజైన్‌ చేశారు. అలానే నీరు, చెమటకు పాడవకుండా ఐపీఎక్స్‌4 రేటింగ్ స్ల్పాష్, స్వెట్‌ రెసిస్టెంట్‌తో దీన్ని తయారుచేశారు. వాయిస్‌ కమాండ్స్‌ని కూడా స్వీకరిస్తుంది.

ప్రస్తుతానికి దీనిని అమ్మకాలు నేపాల్‌లో మాత్రమే ప్రారంభంకానున్నాయి. బ్లాక్‌, బ్లూ రంగుల్లో లభించనున్న ఈ ఇయర్‌ఫోన్స్‌ ధర 2,099 నేపాలీ రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1,300. అయితే సోనిక్‌బాస్‌ను భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారు? ధర ఎంత?అనే దానిపై రెడ్‌మీ నుంచి అధికారిక సమాచారం లేదు. రెడ్‌మీ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా సోనిక్‌బాస్‌ను భారత్‌లో విడుదల చేస్తారని మార్కెట్ వర్గాల అంచనా.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న