Published : 16/10/2020 21:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
శాంసంగ్‌ వారి రెండు మడతలు ఫోన్‌ వస్తోంది

ఇంటర్నెట్‌డెస్క్‌: మార్కెట్లో ఎన్ని రకాల ఫోన్లు ఉన్నా ఫోల్డింగ్ ఫోన్ ప్రత్యేకతే వేరు. ఇప్పటికే శాంసంగ్, మోటోరోలా ఈ మోడల్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. తాజాగా మరో కొత్త ఫోల్డింగ్ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు శాంసంగ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ ఫోల్డింగ్ ఫోన్‌లా కాకుండా డ్యుయల్‌ ఫోల్డింగ్ డిస్‌ప్లే ఫీచర్‌తో ఈ ఫోన్ రానుందట. అంటే ట్యాబ్‌ తరహాలో మొబైల్ స్క్రీన్‌ ఉండబోతుందన్నమాట. అందులో రెండు డిస్‌ప్లేలు ఉంటాయి. వాటిని తెరిచినప్పుడు మొబైల్‌ స్క్రీన్‌ కాస్తా ట్యాబ్‌ స్క్రీన్‌లా మారిపోతుంది. అయితే షావోమి కూడా ఇదే తరహాలో డ్యుయల్ ఫోల్డింగ్ ఫోన్‌ను తీసుకురానుందట. ఈ రెండు కంపెనీల డ్యుయల్‌ ఫోల్డింగ్ మోడల్స్‌ ఒకే తీరుగా ఉన్నప్పటికీ డిస్‌ప్లేలో తేడా ఉన్నట్లు తెలుస్తోంది.

శాంసంగ్‌ తన డ్యుయల్ ఫోల్డింగ్ ఫోన్‌ను పాకెట్‌ ఫ్రెండ్లీ డిజైన్‌తో అవసరమైతే లాప్‌టాప్‌లా కూడా ఉపయోగించుకునేలా రూపొందించనుందట. అంతేకాకుండా శాంసంగ్ డ్యుయల్ ఫోల్డింగ్ ఫోన్‌ టచ్‌స్క్రీన్‌ ఫీచర్‌ ఉన్న లెనోవా యోగా బుక్‌ వంటి ల్యాప్‌టాప్‌లకు గట్టి పోటీ ఇస్తుందని టెక్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌, గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మైక్రోసాఫ్ట్‌ సర్ఫేస్‌ డ్యుయోకు పోటీగా శాంసంగ్‌ డ్యుయల్ ఫోల్డింగ్ డిస్‌ప్లే ఫోన్ తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఇది ఎలా ఉండబోతుంది..ఫీచర్స్‌ వంటి వివరాలు తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే.

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు