WhatsApp colors feature: వాట్సాప్‌లో కొత్త ‘కలర్‌’కు మారొచ్చు!
close

Updated : 26/08/2021 18:57 IST
WhatsApp colors feature: వాట్సాప్‌లో కొత్త ‘కలర్‌’కు మారొచ్చు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్ (Whatsapp).. గ్రూప్‌ కాలింగ్‌, డేటా ట్రాన్సఫర్, డిస్అపీయరింగ్, పేమెంట్స్‌ వంటి ఫీచర్లతో యూజర్లకు మరింత చేరువైంది. ఇప్పుడు మరో ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం వాట్సాప్‌ తీసుకురాబోతుంది. న్యూ కలర్‌ స్కీమ్‌  (Whatsapp color scheme) పేరుతో ఫీచర్‌ను పరిచయం చేయనుంది.  దీనికి సంబంధించి టెస్టింగ్‌ కోసం బీటా టెస్టర్స్‌కు అవకాశం కల్పించినట్లు వాట్సాప్‌ పేర్కొంది. ‘న్యూ కలర్‌’ ఫీచర్‌ వాట్సాప్‌ లైట్ అండ్‌ డార్క్‌ థీమ్స్ కోసం అన్వయించుకోవచ్చని తెలిపింది. అలానే బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు సెండ్‌ బటన్‌కు ఉపయోగపడనుంది. 

ప్రస్తుతం వాట్సాప్‌లోని టాప్ బార్‌ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అదే న్యూ కలర్‌ స్కీమ్ ఫీచర్‌ అప్లై చేస్తే గ్రీన్‌ నుంచి గ్రే కలర్‌లోకి మార్చుకోవచ్చు. టాప్‌ బార్‌తోపాటు బ్యాక్‌గ్రౌండ్, మెసేజ్‌ బబుల్స్‌, సెండ్‌ బటన్‌ ఛేంజ్‌ చేసుకునే అవకాశం ఉంది. డబ్ల్యూఏ బీటా ఇన్ఫో ప్రకారం న్యూ కలర్ స్కీమ్‌ స్టేటస్ అప్‌డేట్స్‌, చాట్‌ షేర్‌ షీట్‌కు అప్లికేబుల్‌ అవ్వొచ్చు. అలాగే మరో ఫీచర్‌ను బీటా వెర్షన్‌లో వాట్సాప్‌ తీసుకురానుంది. గ్రూప్‌ క్రియేషన్‌ డేట్‌ను ఆండ్రాయిడ్‌ యూజర్లకూ (Android Users) పరిచయం చేయనుంది. ఇప్పటి వరకూ ఇది కేవలం ఐఫోన్ యూజర్లకు మాత్రమే ఉండగా.. త్వరలో ఆండ్రాయిడ్‌ వారికీ తీసుకొస్తామని వాట్సాప్‌ వెల్లడించింది. అంతేకాకుండా చాట్ బార్‌లోని ‘టైప్ ఏ మెసేజ్’కు బదులు కొత్త ‘మెసేజ్’బ్యానర్‌ని తీసుకురావాలని వాట్సాప్‌ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బీటా యూజర్లకు అవకాశం కల్పించినప్పటికీ మిగతా వారికి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న