Mi To Xiaomi Logo: ఎంఐ కాదు.. ఇక మీదట ‘షావోమీ’ బ్రాండ్‌
close

Published : 14/09/2021 18:40 IST
Mi To Xiaomi Logo: ఎంఐ కాదు.. ఇక మీదట ‘షావోమీ’ బ్రాండ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్ల నుంచి టీవీలు.. స్మార్ట్‌బ్యాండ్‌ల వరకు షావోమీ సంస్థ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. మిడ్‌ బడ్జెట్‌ డివైజ్ల విపణిలో అగ్రస్థానం దక్కించుకుంది. హై-రేంజ్‌ మొబైల్స్, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు ఎంఐ (mi) బ్రాండ్‌తో మార్కెట్‌లోకి వస్తుంటాయి. అలానే తక్కువ, మధ్యశ్రేణి ధరల్లో వచ్చే ఉత్పత్తులను రెడ్‌మీ బ్రాండ్‌తో షావోమీ విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ఇక నుంచి ఎంఐ బ్రాండ్‌గా కాకుండా ‘షావోమీ’పేరుతోనే వినియోగదారుల ముందుకు వచ్చేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ‘ఎంఐ’ లోగో స్థానంలో కొత్త బ్రాండ్‌ ‘షావోమీ’తో డివైజస్‌ మార్కెట్లోకి విడుదలవుతాయని వెల్లడించింది. ఇప్పటికే వచ్చిన ఎంఐ బ్రాండ్‌ మొబైల్స్‌ ఇక నుంచి షావోమీ లోగోతో వస్తాయని పేర్కొంది. 

షావోమీ (ఎంఐ) ఫోన్స్‌ను విపణిలో ప్రీమియం సెగ్మెంట్‌ బ్రాండ్‌గా పిలుస్తుంటారు. ఇటీవల భారత మార్కెట్‌లోకి విడుదలైన  Mi11 అల్ట్రా, Mi11X సిరీస్‌ ఫోన్లు ఈ కేటగిరీలోకి వచ్చేవే. ఇక నుంచి ఇవన్నీ Xiaomi 11గా మారిపోతాయని షావోమీ వెల్లడించింది. ‘ప్రపంచవ్యాప్తంగా లీడింగ్‌ టెక్నాలజీ బ్రాండ్‌ అయిన షావోమీ ప్రధాన లక్ష్యం.. తమ బ్రాండ్‌కి ఉత్పత్తులకు మధ్య ఉన్న అంతరాన్ని తొలగించడమే. రాబోయే పండుగ సీజన్‌ నుంచి ‘ఎంఐ’ను ‘షావోమీ’గా రీనేమ్‌ చేసి ఉత్పత్తులను తీసుకువస్తున్నాం’ అని షావోమీ ఇండియా మార్కెటింగ్‌ హెడ్‌ జస్కరన్‌ సింగ్‌ కపానీ పేర్కొన్నారు. ఎంఐ బ్రాండింగ్‌కు బదులు ‘షావోమీ’ లోగోను తీసుకురావాలని గత సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నట్లు కపానీ వివరించారు. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న