Latest Telugu News, Headlines, Breaking News, Articles
close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమరచింత: అమరచింత మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ నిరుపయోగంగా ఉండడంతో గత రెండు రోజులుగా యువకులు స్వచ్ఛందంగా శ్రమదానం చేశారు. శ్రీ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కాడి గణేష్ యువకుల శ్రమదానానికి స్పందించి బస్టాండ్‌లో వసతుల కల్పనకు రూ.50 వేలు విరాళంగా అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బస్టాండ్‌లో ఆర్టీసీ అధికారులు కనీస వసతులు కల్పించకపోవడంతో యువకులు ముందుకొచ్చి శ్రమదానం చేసి బస్టాండ్‌ను వినియోగంలోకి తెచ్చారన్నారు. విరాళంగా వచ్చిన డబ్బును బస్టాండ్‌లో లైట్లు, ప్రయాణికులకు నీటి వసతి కల్పించేందుకు వినియోగించాలని యువకులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్‌ సభ్యులు భాస్కర్‌, తిరుమలేష్‌ తదితరులు పాల్గొన్నారు.


జిల్లా వార్తలు
మరిన్ని

ఈటీవీ స్పెషల్

దేవతార్చన