ప్రభుత్వ ఉద్యోగాలు

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టుగ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌) బీబీనగర్‌(తెలంగాణ)లోని...

Published : 05 May 2020 00:34 IST

ఎయిమ్స్‌, బీబీనగర్‌


 

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టుగ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌) బీబీనగర్‌(తెలంగాణ)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 138 పోస్టులు: ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌) ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనల్‌ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 12, 2020. దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: జూన్‌ 24, 2020. వెబ్‌సైట్‌: https://www.jipmer.edu.in/

జీజీహెచ్‌, శ్రీకాకుళం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన శ్రీకాకుళంలోని గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌(జీజీహెచ్‌) సూపరింటెండెంట్‌ కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 51 పోస్టులు: అనెస్తీషియాలజీ, పల్మనాలజిస్ట్‌, జనరల్‌ మెడిసిన్‌. అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ డీఎన్‌బీ/ డిప్లొమా ఉత్తీర్ణత. ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, ఇతర వివరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: మే 08, 2020. చిరునామా: సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌, శ్రీకాకుళం, ఏపీ.

వెబ్‌సైట్‌: https:///srikakulam.ap.gov.in/

సిపెట్‌, చెన్నై

చెన్నై ప్రధానకేంద్రంగా ఉన్న సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సిపెట్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 57 పోస్టులు: సీనియర్‌ ఆఫీసర్‌, ఆఫీసర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఆఫీసర్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంబీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌/ ప్రాక్టికల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. చివరి తేది: మే 29, 2020. చిరునామా: డైరెక్టర్‌(అడ్మినిస్ట్రేషన్‌), సిపెట్‌ ప్రధాన కార్యాలయం, టీవీకే ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌, గిండీ, చెన్నై-600032. వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in/

సీపీసీబీ, దిల్లీ

దిల్లీలోని భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌(సీపీసీబీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 48 పోస్టులు: సైంటిస్ట్‌, జూనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ టెక్నీషియన్‌, జూనియర్‌ టెక్నీషియన్‌, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: రాతపరీక్ష/ స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మే 05, 2020 దరఖాస్తుకు చివరి తేది: మే 25, 2020 చిరునామా: సీపీసీబీ, పరివేష్‌ భవన్‌, ఈస్ట్‌ అర్జున్‌ నగర్‌, దిల్లీ-110032. వెబ్‌సైట్‌: https://cpcb.nic.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని