Teacher Jobs: కస్తుర్బా స్కూల్స్‌లో 1,358 టీచర్ పోస్టులు.. దరఖాస్తుల గడువు పొడిగింపు
ఏపీలో కస్తూర్బా పాఠశాలల్లో 1358 మంది కాంట్రాక్టు టీచర్ల భర్తీకి దరఖాస్తుల గడువు పొడిగించారు.
అమరావతి: ఏపీలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల గడువును సమగ్ర శిక్షా సొసైటీ పొడిగించింది. కాంట్రాక్టు ప్రాతిపదికన మొత్తం 1,358 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను మే 30 నుంచి జూన్ 5వరకు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా దరఖాస్తుల గడువును అధికారులు జూన్ 8వరకు పొడిగించారు. అప్లై చేసే క్రమంలో అభ్యర్థులకు సాంకేతిక సమస్యలు ఎదురవ్వడంతో వారి నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమగ్ర శిక్షా సొసైటీ తెలిపింది.
నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..
- మొత్తం ఖాళీలివే.. ప్రిన్సిపాల్ 92 పోస్టులు ఉండగా.. పోస్టు గ్రాడ్యుయేషన్ టీచర్ 846; సీఆర్టీ 374, పీఈటీ 46 చొప్పున పోస్టులు ఉన్నాయి.
- విద్యార్హతలు.. ఆయా ఉద్యోగాలను బట్టి డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీలలో ఉత్తీర్ణులై ఉండాలి.
- వయో పరిమితి: జనరల్ అభ్యర్థులకు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీలకు అయిదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల చొప్పున వయో సడలింపు ఉంటుంది.
- గౌరవ వేతనం: ప్రిన్సిపాళ్లకు రూ.34,139; సీఆర్టీలకు రూ.26,759; పీజీటీలకు రూ.26,759; పీఈటీలకు రూ.26,759 చొప్పున నెలకు గౌరవ వేతనం లభిస్తుంది.
- దరఖాస్తు రుసుము: రూ.100. కేవలం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరిస్తారు.
- ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసే విధానం, జిల్లాలు, సబ్జెక్టులు, రోస్టర్ వారీగా ఉద్యోగ ఖాళీలు, విద్యార్హతలు, వేతనం వంటి పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?
-
Crime: డబ్బు కోసం దారుణ హత్య.. తీరా చూస్తే..!
-
Social Look: నజ్రియా వెకేషన్.. నయన్ సెలబ్రేషన్స్..!
-
Crime news మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. కస్టడీ నుంచి పారిపోయేందుకు నిందితుడి యత్నం!
-
Team India: కప్పు ముందు కనువిప్పు.. టీమ్ఇండియాకు ఓటమి నేర్పే పాఠాలెన్నో