CAPFలో 50,187 పోస్టులు.. ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్‌ పీఈటీ ఫలితాలు వచ్చేశాయ్‌

SSC GD Constable: సాయుధ బలగాల్లో భారీగా ఉద్యోగాలకు నిర్వహించిన శారీరక సామర్థ్య పరీక్ష(PET/PST) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ కింద ఇచ్చిన లింక్‌ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు.

Updated : 30 Jun 2023 17:54 IST

దిల్లీ: సాయుధ బలగాల్లో (CAPF) 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీకి నిర్వహించిన ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌(PET/PST) ఫలితాలు విడుదలయ్యాయి. శారీరక సామర్థ్య పరీక్షలకు మొత్తం 3,70,998 మంది అభ్యర్థులు హాజరు కాగా.. వారిలో 1,46,292  మంది  వైద్య పరీక్షలకు అర్హత సాధించినట్టు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) వెల్లడించింది.  వీరిలో 14,444 మంది మహిళలు కాగా.. 1,31,848 మంది పురుషులు ఉన్నట్టు తెలిపింది. గతేడాది నవంబర్‌లో సాయుధ బలగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి  నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. దశల వారీగా మొత్తం 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించగా.. పదో తరగతి విద్యార్హత కలిగిన లక్షలాదిమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

వైద్య పరీక్షలకు అర్హత సాధించిన పురుష అభ్యర్థుల జాబితా

వైద్య పరీక్షలకు అర్హత సాధించిన మహిళా అభ్యర్థుల జాబితా

ఏయే విభాగంలో ఎన్నెన్ని పోస్టులు.. బీఎస్‌ఎఫ్‌లో 21,052, సీఐఎస్‌ఎఫ్‌లో 6060, సీఆర్‌పీఎఫ్‌లో 11169, ఎస్‌ఎస్‌బీలో 2274, ఐటీబీపీలో 1890+3752, ఏఆర్‌లో 3601, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 214, ఎన్‌సీబీలో 175 చొప్పున మొత్తం 50,187 ఖాళీలున్నాయి.

బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్‌సీబీలో సిపాయి పోస్టులు భర్తీకి జనవరి, ఫిబ్రవరి నెలల్లో SSC ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మే 1 నుంచి 6 తేదీల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులను నిర్వహించింది. శారీరక సామర్థ్య పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి తుది ఫలితాలు విడుదల చేయనున్నారు. అనంతరం రిజర్వేషన్‌ను అనుసరించి ఉద్యోగాలకు నియమిస్తారు. మెడికల్‌ టెస్ట్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాల కోసం క్లిక్‌ చేయండి.

విత్‌ హెల్డ్‌ చేసిన పురుష అభ్యర్థుల జాబితా 

విత్‌ హెల్డ్‌ చేసిన మహిళా అభ్యర్థుల జాబితా 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని