నోటిఫికేషన్స్‌

తిరుపతిలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన తిరుపతి జిల్లాలో 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 22 Jan 2024 00:07 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

తిరుపతి జిల్లాలో ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, అకౌంటెంట్‌లు

తిరుపతిలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన తిరుపతి జిల్లాలో 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • సోషల్‌ వర్కర్‌ కమ్‌- ఎర్లీ చైల్డ్‌ హుడ్‌ ఎడ్యుకేటర్‌- 1 
  • నర్స్‌- 1
  • డాక్టర్‌ (పార్ట్‌ టైం)- 1  
  • ఆయా (మహిళలు)- 6
  • చౌకీదార్‌- 1  

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
వయసు: 25-42 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, తిరుపతి, తిరుపతి జిల్లా’ చిరునామాకు పంపించాలి.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 26.01.2024.
వెబ్‌సైట్‌: https://tirupati.ap.gov.in/


విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో..

తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ), స్పేస్‌ ఫిజిక్స్‌ ల్యాబొరేటరీ 5 జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హతలు: ఎమ్మెస్సీ (ఫిజిక్స్‌/ అప్లైడ్‌ ఫిజిక్స్‌/ ఇంజినీరింగ్‌ ఫిజిక్స్‌/ స్పేస్‌ ఫిజిక్స్‌/ అట్మాస్ఫియరిక్‌ సైన్స్‌/ మెటియరాలజీ/ ప్లానెటరీ సైన్సెస్‌). ఎంఎస్‌/ ఎంఈ, ఎంటెక్‌ (ఫిజిక్స్‌/ అట్మాస్ఫియరిక్‌ సైన్స్‌/ ప్లానెటరీ సైన్స్‌/ ఎర్త్‌ అండ్‌ స్పేస్‌ సైన్స్‌/ అప్లైడ్‌ ఫిజిక్స్‌/ ఇంజినీరింగ్‌ ఫిజిక్స్‌). సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ / గేట్‌/ జెస్ట్‌లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 30.01.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: దరఖాస్తుల షార్ట్‌-లిస్ట్‌ చేసి అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30.01.2024.
వెబ్‌సైట్‌: https://www.vssc.gov.in/advt329.html


ప్రవేశాలు

ఐఐపీ ముంబయిలో డిప్లొమా

ముంబయిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌ 2024-2025 విద్యా సంవత్సరానికి కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

1. 60వ బ్యాచ్‌- ఇంటెన్సివ్‌ ట్రైనింగ్‌ కోర్సు (ప్యాకేజింగ్‌)

వ్యవధి: 3 నెలలు (ఫుల్‌ టెమ్‌)
అర్హత: 12వ తరగతి/ ఐటీఐ.
వయసు: పరిమితి లేదు.

2. డిప్లొమా ఇన్‌ ప్యాకేజింగ్‌

వ్యవధి: 18 నెలలు (కరస్పాండెన్స్‌ ద్వారా)
అర్హత: ఏదైనా విభాగంలో డిప్లొమా. ప్యాకేజింగ్‌ రంగంలో ఏడాది పని అనుభవం.
వయసు: పరిమితి లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 29.02.2024.
వెబ్‌సైట్‌: https://www.iip-in.com/


ఈఎస్‌ఐసీలో అసోసియేట్‌ ప్రొఫెసర్లు  

హైదరాబాదు సనత్‌నగర్‌లోని కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌... ఒప్పంద ప్రాతిపదికన 4 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

విభాగాలు: న్యూరో సర్జరీ, యూరాలజీ.
అర్హత: మెడికల్‌ పీజీ.
వేతనం: నెలకు రూ.78,800.
వయసు: 69 ఏళ్లు మించకూడదు.
వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ తేదీ: 30.01.2024.
వేదిక: ఈఎస్‌ఐసీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, కాన్ఫరెన్స్‌ రూమ్‌, రెండో అంతస్తు, సనత్‌నగర్‌, హైదరాబాద్‌.
వెబ్‌సైట్‌: https://www.esic.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని