ప్రభుత్వ ఉద్యోగాలు

రైల్వేలో అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టులు

Published : 23 Jan 2024 00:02 IST

రైల్వేలో అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టులు 

5,696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ (ఏఎల్‌పీ) పోస్టులను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్‌, అజ్‌మేర్‌, బెంగళూరు, భోపాల్‌, భువనేశ్వర్‌, బిలాస్‌పూర్‌, చండీఘర్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్‌, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్‌, పట్నా, ప్రయాగ్‌రాజ్‌, రాంచీ, సికింద్రాబాద్‌, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్‌.
అర్హత: అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసినవారూ అర్హులే.
వయసు: 01-07-2024 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.
ఎంపిక: రాత పరీక్షలు(సీబీటీ-1, 2), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 19-02-2024
వెబ్‌సైట్‌: https://indianrailways.gov.in/


ఎన్‌హెచ్‌ఏఐలో డిప్యూటీ మేనేజర్‌లు

న్యూదిల్లీలోని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 60 డిప్యూటీ మేనేజర్‌ (టెక్నికల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: యూపీఎస్సీ 2023లో నిర్వహించిన ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌, పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-02-2024.
వెబ్‌సైట్‌: https://nhai.gov.in/


ఎన్‌ఎండీసీలో..

హైదరాబాద్‌లోని ఎన్‌ఎండీసీ సీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 16 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  •  హెడ్‌- ఎన్‌ఎండీసీ సీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌: 01
  •  ప్రాజెక్ట్‌ మేనేజర్‌: 01
  •  మానిటరింగ్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ ఆఫీసర్‌: 01
  •  ఆఫీస్‌ మేనేజర్‌: 01  
  •  డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్లు: 07
  •  బ్లాక్‌ కోఆర్డినేటర్లు: 05

అర్హత: సంబంధిత విభాగంలో సీఏ/ డిగ్రీ/ పీజీతో పాటు పని అనుభవం.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2024.
వెబ్‌సైట్‌: https://www.nmdc.co.in/


ప్రవేశాలు

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో యూజీ, పీజీ

హైదరాబాద్‌లోని డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి దూరవిద్యా విధానంలో యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని 22 అధ్యయన కేంద్రాల్లో అభ్యర్థులు ప్రవేశాలు పొందవచ్చు.  

యూజీ: బీఏ, బీకాం, బీఎస్సీ
పీజీ:

1. ఎంఏ: జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌/ ఎకనామిక్స్‌/ హిస్టరీ/ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌/ పొలిటికల్‌ సైన్స్‌/ సోషియాలజీ/ ఇంగ్లిష్‌/ తెలుగు/ హిందీ/ ఉర్దూ
2. ఎమ్మెస్సీ: సైకాలజీ/ బోటనీ/ కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌/ ఫిజిక్స్‌/ జువాలజీ
3. ఎంకాం
4. ఎంఎల్‌ఐఎస్సీ
5. బీఎల్‌ఐఎస్సీ
6. డిప్లొమా: సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌/ మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌/ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌/ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌/ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌/ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌/ రైటింగ్‌ ఫర్‌ మాస్‌ మీడియా ఇన్‌ తెలుగు/ హ్యూమన్‌ రైట్స్‌/ కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ టూరిజం/ విమెన్స్‌ స్టడీస్‌.
7. సర్టిఫికెట్‌: ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌/ లిటరసీ అండ్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌/ ఎన్‌జీవోస్‌ మేనేజ్‌మెంట్‌/ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌

వ్యవధి: యూజీకి మూడేళ్లు, పీజీకి రెండేళ్లు, ఎంఎల్‌ఐఎస్సీ/ బీఎల్‌ఐఎస్సీ/ డిప్లొమాకు ఏడాది, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌కు ఆరు నెలలు.
అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, డిగ్రీ.
రిజిస్ట్రేషన్‌, ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 31-01-2024.
వెబ్‌సైట్‌:www.braouonline.in/UGFirstyear/FirstHome.aspx


ఎఫ్‌టీఐఐ, పుణెలో పీజీ డిప్లొమాలు  

పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ) 2024-25 విద్యా సంవత్సరానికి టీవీ వింగ్‌ పీజీ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

1. ఏడాది పీజీ సర్టిఫికెట్‌ (స్పెషలైజేషన్‌ ఇన్‌ డైరెక్షన్‌): 11 సీట్లు
2. ఏడాది పీజీ సర్టిఫికెట్‌ (స్పెషలైజేషన్‌ ఇన్‌ ఎలక్ట్రానిక్‌ సినిమాటోగ్రఫీ): 11 సీట్లు
3. ఏడాది పీజీ సర్టిఫికెట్‌ (స్పెషలైజేషన్‌ ఇన్‌ వీడియో ఎడిటింగ్‌): 11 సీట్లు
4. ఏడాది పీజీ సర్టిఫికెట్‌ (స్పెషలైజేషన్‌ ఇన్‌ సౌండ్‌ రికార్డింగ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇంజినీరింగ్‌): 11 సీట్లు

అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా తత్సమానం.
ఎంపిక: రాత పరీక్ష, ఓరియంటేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1200. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.600.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04-02-2024.
వెబ్‌సైట్‌: https://www.ftii.ac.in/


ఐఐఎం రాంచీలో పీహెచ్‌డీ

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ రాంచీ 2024 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విభాగాలు: ఎకనామిక్స్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ అండ్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌, లిబరల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌, మార్కెటింగ్‌, ఆర్గనైజేషన్‌ బిహేవియర్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, స్ట్రాటజీ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌.

అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ.
దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000. ఇతరులకు రూ.2000.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20-03-2024.
వెబ్‌సైట్‌: https://iimranchi.ac.in/phd


ఎన్‌ఐటీ సూరత్‌కల్‌లో ఎంబీఏ

సూరత్‌కల్‌లోని ఎన్‌ఐటీ కర్ణాటక, స్కూల్‌ ఆఫ్‌ హ్యూమానిటీస్‌, సోషియల్‌ సైన్సెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ 2024-26 విద్యా సంవత్సరానికి ఎంబీఏలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

ఎంబీఏ (రెండేళ్ల ఫుల్‌ టైం డిగ్రీ): 80 సీట్లు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు క్యాట్‌-2023 లేదా మ్యాట్‌ (సెప్టెంబర్‌ 2023/ డిసెంబర్‌ 2023) లేదా గేట్‌ 2023/ 24 స్కోరు.
సీటు కేటాయింపు: క్యాట్‌/ మ్యాట్‌/ గేట్‌ స్కోర్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా.
దరఖాస్తు రుసుము: ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు అభ్యర్థులకు రూ.150).
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 03-04-2024.
దరఖాస్తు హార్డుకాపీ స్వీకరణకు చివరి తేదీ: 08-04-2024.
ఎంపిక తేదీలు: 22-04-2024, 25-04-2024.
వెబ్‌సైట్‌: https://www.nitk.ac.in/


ఎన్‌ఐటీ కాలికట్‌లో ఎంబీఏ

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కాలికట్‌ ఎంబీఏలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

(రెగ్యులర్‌-క్యాట్‌/ఇండస్ట్రీ- స్పాన్సర్డ్‌): 75 సీట్లు

అర్హత: కనీసం 60% మార్కులతో ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు క్యాట్‌ స్కోరు. సంబంధిత సంస్థల్లో రెండేళ్ల పారిశ్రామిక/ పరిశోధన అనుభవం.
ఎంపిక: క్యాట్‌ స్కోర్‌, జీడీ, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.500.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-03-2024.
జీడీ/ ఇంటర్వ్యూకు ఎంపిక జాబితా వెల్లడి: 15-04-2024.
వెబ్‌సైట్‌: ttps://nitc.ac.in/ noticeboard/admissions


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని