నోటిఫికేషన్స్‌

బెంగళూరులోని ఇస్రో, యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌, ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌- 224 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 13 Feb 2024 00:38 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
ఇస్రోలో సాంకేతిక పోస్టులు

బెంగళూరులోని ఇస్రో, యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌, ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌- 224 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • సైంటిస్ట్‌/ ఇంజినీర్‌-ఎస్సీ: 05 
  • టెక్నికల్‌ అసిస్టెంట్‌: 55
  • సైంటిఫిక్‌ అసిస్టెంట్‌: 06
  • లైబ్రరీ అసిస్టెంట్‌: 01
  • టెక్నీషియన్‌-బి/ డ్రాఫ్ట్స్‌మ్యాన్‌-బి: 142 
  • ఫైర్‌మ్యాన్‌-ఎ: 03  
  • కుక్‌: 04 
  • లైట్‌ వెహికల్‌ డ్రైవర్‌ ‘ఎ’ అండ్‌ హెవీ వెహికల్‌ డ్రైవర్‌ ‘ఎ’: 08

విభాగాలు: మెకట్రానిక్స్‌, మెటీరియల్‌ సైన్స్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, ప్లంబర్‌, టర్నర్‌, కార్పెంటర్‌, వెల్డర్‌.
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పని అనుభవం.
ఎంపిక: రాత పరీక్ష/ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 01-03-2024.
వెబ్‌సైట్‌: https://www.isro.gov.in/


రాజమహేంద్రవరం జోన్‌లో..

రాజమహేంద్రవరంలోని రీజనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌, జోన్‌-2 కార్యాలయం 4 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  
అర్హత: డిగ్రీ, బీపీఈడీ.  
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

ఫార్మసిస్ట్‌ పోస్టులు

రీజనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌, జోన్‌-2 కార్యాలయం 4 ఫార్మసిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  
అర్హత: డీఫార్మసీ లేదా బీఫార్మసీ. వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.ఈ రెండు రకాల పోస్టులకూ..
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను రాజమహేంద్రవరంలోని రీజనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌, జోన్‌-2 కార్యాలయం చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 20-02-2024.
వెబ్‌సైట్‌:https://eastgodavari.ap.gov.in/


ఏపీలో అనలిస్ట్‌ కొలువులు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో 18 అనలిస్ట్‌ గ్రేడ్‌-2 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ (కెమిస్ట్రీ/ బయో కెమిస్ట్రీ/ బయాలజీ/ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌).
వయసు: 01/07/2024 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.370. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.250.
ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 19/03/2024 నుంచి 08/04/2024 వరకు.
వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/


అసిస్టెంట్‌ డైరెక్టర్‌లు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏపీ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ సర్వీసులో 7 అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: బీఆర్క్‌ లేదా బీఈ, బీటెక్‌ (సివిల్‌) లేదా బీప్లానింగ్‌/ బీటెక్‌ (ప్లానింగ్‌) లేదా ఎంఏ (జాగ్రఫీ), పీజీ లేదా టౌన్‌ ప్లానింగ్‌లో డిప్లొమా.
వయసు: 01/07/2024 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.370. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.250.
ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 21/03/2024 నుంచి 10/04/2024 వరకు.
వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/


అర్హత పరీక్ష

ఏపీ సెట్‌-2024

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్‌ పోస్టులకు అర్హత సాధించేందుకు ఏపీ సెట్‌ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను ఏయూ చూస్తోంది. జనరల్‌ స్టడీస్‌, 30 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు.
అర్హత: కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీ.  
వయసు: గరిష్ఠ పరిమితి లేదు.
పరీక్ష రుసుము: జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి రూ.1200. బీసీ కేటగిరీకి రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులకు రూ.700.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 14-02-2024
దరఖాస్తుకు చివరి తేదీ: 06-03-2024
పరీక్ష తేదీ: 28-04-2024
వెబ్‌సైట్‌: https://apset.net.in/home.aspx


వాక్‌ - ఇన్‌

బోధనాసుపత్రుల్లో ..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన 12 రేడియేషన్‌ సేఫ్టీ ఆఫీసర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  
అర్హత: ఎమ్మెస్సీ (ఫిజిక్స్‌/ న్యూక్లియర్‌ ఫిజిక్స్‌), డిప్లొమా (రేడియోలాజికల్‌ ఫిజిక్స్‌/ మెడికల్‌ ఫిజిక్స్‌), రేడియోలాజికల్‌ సేఫ్టీ ఆఫీసర్‌ సర్టిఫికెట్‌.
వయసు: 42 ఏళ్లు మించకూడదు. ఎంపిక: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1000 (బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్‌, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులకు రూ.500).
వాక్‌ ఇన్‌ తేదీ: 19.02.2024.
స్థలం: డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయం, పాత జీజీహెచ్‌ క్యాంపస్‌, హనుమాన్‌ పేట, విజయవాడ.
వెబ్‌సైట్‌: https://dme.ap.nic.in/


ప్రవేశాలు

గిరిజన సంక్షేమ గురుకులాల్లో

ఎనిమిదో తరగతి, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సర ప్రవేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (గురుకులం) ప్రకటన విడుదల చేసింది.  
సీట్ల సంఖ్య: ఇంటర్‌ ఎంపీసీ- 300; ఇంటర్‌ బైపీసీ- 300;8వ తరగతి- 180.
అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరం ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎనిమిదో తరగతి ప్రవేశ పరీక్షకు అర్హులు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్‌ ప్రవేశ పరీక్షకు అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షకాదాయం రూ.లక్షకు మించకూడదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25-03-2024.
హాల్‌ టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: 30-03-2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 07-04-2024.
వెబ్‌సైట్‌: https://twreiscet.apcfss.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని