నోటిఫికేషన్స్‌

రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్సు (ఆర్‌పీఎఫ్‌)/ రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌)లో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ (రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు) ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.

Published : 10 Mar 2024 04:11 IST

గవర్నమెంట్‌ జాబ్స్‌
రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్సులో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులు

రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్సు (ఆర్‌పీఎఫ్‌)/ రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌)లో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ (రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు) ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.

మొత్తం పోస్టులు: 4,660.

1. కానిస్టేబుల్‌: 4,208 పోస్టులు
2. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌: 452 పోస్టులు

ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్‌, అజ్‌మేర్‌, బెంగళూరు, భోపాల్‌, భువనేశ్వర్‌, బిలాస్‌పూర్‌, చండీగఢ్‌, చెన్నై, గువాహటి, జమ్మూ అండ్‌ శ్రీనగర్‌, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్‌, పట్నా, ప్రయాగ్‌రాజ్‌, రాంచీ, సికింద్రాబాద్‌, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్‌. అర్హత: కానిస్టేబుల్‌ పోస్టులకు పదో తరగతి. ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.07.2024 నాటికి కానిస్టేబుల్‌ పోస్టులకు 18-28 ఏళ్ల మధ్య; ఎస్సై పోస్టులకు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.

ప్రారంభ వేతనం: నెలకు ఎస్సై పోస్టులకు రూ.35,400; కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.21,700. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌, మెడికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.

ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు, దరఖాస్తులు ప్రారంభం: 15-04-2024.
ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు, దరఖాస్తుకు చివరి తేదీ: 14-05-2024.

వెబ్‌సైట్‌: https://rpf.indianrailways.gov.in/RPF/


టీటీడీలో డిగ్రీ/ జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు శాశ్వత ప్రాతిపదికన తితిదే డిగ్రీ కళాశాలలు/ ఓరియంటల్‌ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్లు, తితిదే జూనియర్‌ కళాశాలల్లో జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 78.

1. డిగ్రీ లెక్చరర్‌: 49 పోస్టులు
అర్హత: కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, నెట్‌/ స్లెట్‌ అర్హత సాధించి ఉండాలి.

2. జూనియర్‌ లెక్చరర్‌: 29 పోస్టులు
అర్హత: కనీసం 55% మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01-07-2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అయిదేళ్లు; దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు: నెలకు డిగ్రీ లెక్చరర్‌కు రూ.61,960- రూ.1,51,370. జూనియర్‌ లెక్చరర్‌కు రూ.57,100- రూ.1,47,760.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్‌ ఆధారిత రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌ మెన్‌ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.370.
ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాలకు మార్చి 25; డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు మార్చి 27.
వెబ్‌సైట్‌: https://www.tirumala.org/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని