GATE-2023 స్కోరుతో అవకాశాలివిగో!

నాల్కోలో మొత్తం 277 గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల్లో అన్‌రిజర్వుడ్‌కు 116, ఈడబ్ల్యూఎస్‌లకు 27, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు 72, ఎస్సీలకు 44, ఎస్టీలకు 18 కేటాయించారు.

Updated : 12 Mar 2024 04:18 IST

2 సంస్థల్లో 377 ఇంజినీర్‌ ట్రెయినీలు

నాల్కోలో మొత్తం 277 గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల్లో అన్‌రిజర్వుడ్‌కు 116, ఈడబ్ల్యూఎస్‌లకు 27, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు 72, ఎస్సీలకు 44, ఎస్టీలకు 18 కేటాయించారు. వివిధ ఇంజినీరింగ్‌ బ్రాంచిల్లోని పోస్టులకు ఏ అర్హతలుండాలో చూద్దాం.

మెకానికల్‌: 127. మెకానికల్‌/ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ ఫుల్‌టైమ్‌ డిగ్రీ పాసవ్వాలి.
ఎలక్ట్రికల్‌: 100.ఎలక్ట్రికల్‌/ పవర్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేయాలి.
ఇన్‌స్ట్రుమెంటేషన్‌: 20. ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ టెలికమ్‌/ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ ఉత్తీరులవ్వాలి.
మెటలర్జీ: 10. మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌ పాసవ్వాలి.
కెమికల్‌: 13. కెమికల్‌ ఇంజినీరింగ్‌/ ఎంటెక్‌ ఇన్‌ అప్లైడ్‌ కెమిస్ట్రీ ఉత్తీర్ణులవ్వాలి.
కెమిస్ట్రీ: 7. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ లేదా ఏఐసీ పూర్తిచేయాలి.
ఇంజినీరింగ్‌/ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పర్సనల్‌ ఇంటర్వ్యూ సమయానికి పరీక్ష పాసవ్వాలి.
02.04.2024 నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో.. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10-15 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

  • దరఖాస్తు ఫీజు జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500. డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులు, ఇతరులకు రూ.100.
  • ఎంపిక: గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌-2023 (గేట్‌-2023)లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల జాబితాను తయారుచేస్తారు. అభ్యర్థులను 1:10 నిష్పత్తిలో పర్సనల్‌ ఇంర్వ్యూకు ఎంపికచేస్తారు. గేట్‌ మార్కులకు 90 శాతం, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 10 శాతం వెయిటేజీ ఉంటుంది.
  • ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరంపాటు ‘ఆన్‌ ద జాబ్‌ ట్రెయినింగ్‌’ ఉంటుంది. ఈ సమయంలో నాల్కోకు చెందిన దేశ, విదేశాల్లోని యూనిట్లు/ ఆఫీసుల్లో ఎక్కడైనా నియమిస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ: 02.04.2024
వెబ్‌సైట్‌:- http://www.nalcoindia.com/


తెహ్రీ హైడ్రోలో...

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ (టీహెచ్‌డీసీ) మొత్తం 100 ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులున్నాయి. అన్‌రిజర్వుడ్‌కు 47, ఎస్సీలకు 13, ఎస్టీలకు 06, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు 25, ఈడబ్ల్యూఎస్‌లకు 09 కేటాయించారు.
దరఖాస్తు ఫీజు రూ.600. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌/ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులు/ ప్రాజెక్టు వల్ల ముంపునకు గురైన ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు ఫీజు లేదు.
1. ఇంజినీర్‌ ట్రెయినీ-సివిల్‌-40: సివిల్‌ ఇంజినీరింగ్‌లో ఫుల్‌టైమ్‌ బీఈ/బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) 65 శాతం మార్కులతో పాసవ్వాలి.
2. ఈటీ-ఎలక్ట్రికల్‌-25: ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ (పవర్‌)/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ పవర్‌ సిస్టమ్స్‌ అండ్‌ హైవోల్టేజ్‌/ పవర్‌ ఇంజినీరింగ్‌లో ఫుల్‌టైమ్‌ బీఈ/బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌ 65 శాతం మార్కులతో పాసవ్వాలి.  
3. ఈటీ-మెకానికల్‌-30: మెకానికల్‌/ మెకానికల్‌ అండ్‌ ఆటోమేషన్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) 65 శాతం మార్కులతో పాసవ్వాలి.
4. ఈటీ-ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌-05: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌/ ఎలక్ట్రానిక్స్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజినీరింగ్‌) 65 శాతం మార్కులతో పాసవ్వాలి.

  • అన్ని పోస్టులకూ గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు. దరఖాస్తు ఫీజు రూ.600. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌/ డిపార్ట్‌మెంట్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక: గేట్‌-2023 స్కోరు ఆధారంగా అభ్యర్థుల జాబితాను తయారుచేసి గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

  • గేట్‌-2023 స్కోర్‌కు 75 శాతం, గ్రూప్‌ డిస్కషన్‌కు 10 శాతం, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఇస్తారు.
  • ఇంటర్వ్యూలో అన్‌రిజర్వుడ్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 50 శాతం, ఓబీసీ (ఎన్‌సీఎల్‌), ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు 30 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 29.03.2024
వెబ్‌సైట్‌:https://www.thdc.co.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని