పోటీ పరీక్షలకు అర్హత ఉందా?

తెలంగాణా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ నిర్వహించే గ్రూప్‌-4 ఉద్యోగ పరీక్షలకు విద్యార్హత డిగ్రీ. యూజీసీ గుర్తింపు పొందిన ఏ విశ్వవిద్యాలయం నుంచైనా కనీసం మూడు సంవత్సరాల డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినవారే గ్రూప్‌-4 ఉద్యోగాలకు అర్హులు.

Published : 02 Jan 2023 00:34 IST

డిప్లొమా విద్యార్థులకు గ్రూప్‌-4 రాయడానికి అవకాశం ఉంటుందా? వీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఏ పోటీ పరీక్షలైనా రాయొచ్చా?

- జి. విక్రమ్‌

తెలంగాణా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ నిర్వహించే గ్రూప్‌-4 ఉద్యోగ పరీక్షలకు విద్యార్హత డిగ్రీ. యూజీసీ గుర్తింపు పొందిన ఏ విశ్వవిద్యాలయం నుంచైనా కనీసం మూడు సంవత్సరాల డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినవారే గ్రూప్‌-4 ఉద్యోగాలకు అర్హులు. దూరవిద్య, ఓపెన్‌ యునివర్సిటీ ద్వారా డిగ్రీ చదివినవారూ అర్హులే. కానీ, డిప్లొమా చదివినవారు గ్రూప్‌- 4 ఉద్యోగాలకు అర్హులు కారు. మన దేశంలో డిగ్రీని పూర్తిచేయడానికి కనీసం 15 సంవత్సరాల పాటు విద్యని అభ్యసించి ఉండాలి. మీరు మూడు సంవత్సరాల డిప్లొమాతో కలిపి 13 సంవత్సరాలే చదివారు కాబట్టి, గ్రూప్‌ 1,2,3,4 పరీక్షలకు అర్హత సాధించాలంటే కచ్చితంగా డిగ్రీ పూర్తిచేయాలి. డిప్లొమా చదివినవారు నేరుగా డిగ్రీ రెండో సంవత్సరంలో ప్రవేశం పొంది, రెండేళ్లలోనే డిగ్రీ పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మీరు డిప్లొమా/పదో తరగతి విద్యార్హత ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే అర్హులు. ఇంటర్మీడియట్‌ విద్యార్హత ఉన్న కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు డిప్లొమా చదివినవారికి కూడా అర్హత ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలావాటికి అర్హత సాధించాలంటే ముందుగా మీరు డిగ్రీని పూర్తి చేయండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని