లైఫ్‌ సైన్సెస్‌లో ఏది మెరుగు?

బీఎస్సీ (మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ) చివరి ఏడాది చదువుతున్నాను. దీని తర్వాత మెడికల్‌ కోడింగ్‌ లేదా ఏ కోర్సులు చేస్తే లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ఉద్యోగం సంపాదించవచ్చు?

Published : 28 Dec 2023 00:35 IST

బీఎస్సీ (మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ) చివరి ఏడాది చదువుతున్నాను. దీని తర్వాత మెడికల్‌ కోడింగ్‌ లేదా ఏ కోర్సులు చేస్తే లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ఉద్యోగం సంపాదించవచ్చు?

నితీష్‌ రెడ్డి

  • బీఎస్సీలో మీరు చదువుతున్న మూడు సబ్జెక్టులకూ మంచి భవిష్యత్తు  ఉంది. మీ ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకోవడానికి బయోటెక్నాలజీ, బయో ఫార్మాస్యూటికల్‌ రిసెర్చ్‌, ఫుడ్‌ టెక్నాలజీ, ఫోరెన్సిక్‌ సైన్సెస్‌, క్లినికల్‌ రిసెర్చ్‌, జెనెటిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, సెల్‌ బయాలజీ, ఇమ్యునాలజీ, కంప్యుటేషనల్‌ బయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్‌, హెల్త్‌ కేర్‌, జీనోమిక్స్‌, పబ్లిక్‌ హెల్త్‌, బయో స్టాటిస్టిక్స్‌, వైరాలజీ, బయో ఎథిక్స్‌ లాంటి సబ్జెక్టుల్లో సర్టిఫికెట్‌/ డిప్లొమా/ పీజీ డిప్లొమా/ పీజీ కోర్సులు చేయొచ్చు. ఇతర ఉద్యోగాలతో పోలిస్తే మెడికల్‌ కోడింగ్‌ ఉద్యోగాల వృద్ధి రేటు కొంత మెరుగ్గానే ఉండటం వల్ల ఆ రంగంలో అవకాశాలు ఎక్కువ. కానీ కొంతకాలానికి మీరు చేస్తున్న ఉద్యోగంలో వైవిధ్యం లేదని ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. మీరు ఏ రంగంలోకి వెళ్ళాలి అనేది పూర్తిగా మీ అభిరుచి, ఆసక్తి, దీర్ఘకాలిక ఆశయాలను పరిగణనలోకి తీసుకుని, సరైన కోర్సును ఎంచుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు