ఐటీలో అకౌంటెంట్‌?

బీకాం, సీఏ ఇంటర్‌ పూర్తిచేశాను. ఓ ఫార్మా డిస్ట్రిబ్యూషన్‌ ఏజెంట్‌ దగ్గర అకౌంటెంట్‌గా పదేళ్లుగా పనిచేస్తున్నా. ఐటీ కంపెనీలో అకౌంటెంట్‌గా ఉద్యోగం చేయాలటే ఏ కోర్సులు చేయాలి?

Published : 23 Jan 2024 00:03 IST

బీకాం, సీఏ ఇంటర్‌ పూర్తిచేశాను. ఓ ఫార్మా డిస్ట్రిబ్యూషన్‌ ఏజెంట్‌ దగ్గర అకౌంటెంట్‌గా పదేళ్లుగా పనిచేస్తున్నా. ఐటీ కంపెనీలో అకౌంటెంట్‌గా ఉద్యోగం చేయాలటే ఏ కోర్సులు చేయాలి?

షేక్‌ మెహరజ్‌ 

మీకు బీకాం డిగ్రీ, సీఏ ఇంటర్‌తో పాటు, అకౌంటెంట్‌గా పది సంవత్సరాల వృత్తి అనుభవం ఉంది. ఈ అర్హతతో ఐటీ కంపెనీలో అకౌంటెంట్‌గా ఉద్యోగం పొందడం కష్టం కాకపోవచ్చు. ఐటీ కంపెనీలో అకౌంటెంట్‌ ఉద్యోగం చేయాలంటే- ఎంఎస్‌ ఎక్సెల్‌పై మంచి పట్టుతో పాటు, ట్యాలీ లాంటి అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ మెరుగ్గా వాడగలిగే సామర్థ్యం ఉండాలి. సాధారణంగా ఐటీ కంపెనీల్లో అకౌంటింగ్‌ విభాగంలో ఎస్‌క్యూఎల్‌ డేటాబేస్‌, ఈఆర్‌పీ లాంటి సాఫ్ట్‌వేర్లను వాడుతూ ఉంటారు. మీరు ఐటీ రంగంలో అకౌంటెంట్‌గా రాణించాలంటే పే సర్టిఫికేషన్‌, కంప్యూటరైజ్డ్‌ అకౌంటింగ్‌, ఎంఐఎస్‌, డీబీఎంఎస్‌ లాంటి సర్టిఫికెట్‌ కోర్సులతో పాటు కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు కూడా అవసరం. అవకాశం ఉంటే ఎంకాం (కంప్యూటర్స్‌) కోర్సును ఆన్‌లైన్‌/ దూరవిద్య ద్వారా చేసే ప్రయత్నం చేయండి.   

 ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు