TS EXAMS-2022: తరతరాలకు తాగు... సాగు నీరు!
తెలంగాణ జాగ్రఫీ
వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు, ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు నీటి పారుదల అత్యంత ప్రధానమైంది. వర్షాలు లేదా వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు, నీటిపారుదల సౌకర్యాలు కల్పించడానికి ప్రాజెక్టులు నిర్మిస్తారు. తరతరాలకు తాగు, సాగు నీరు వీటి ద్వారా అందుతుంది. ఒక ప్రాంతం ప్రగతిలో ప్రధానపాత్ర పోషించే ఈ నీటిపారుదల ప్రాజెక్టులు, వాటి పరీవాహక ప్రాంతాల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి.
తెలంగాణ - నీటి పారుదల ప్రాజెక్టులు
భారతదేశంలో ప్రాముఖ్యత కలిగి ఉన్న రెండు ముఖ్యమైన నదులైన గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం విస్తరించి ఉంది. తెలంగాణలో ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ ఈ నదులపైనే నిర్మించారు. 2020 - 21 గణాంకాల ప్రకారం పరిశీలిస్తే రాష్ట్రంలోని మొత్తం స్థూల నీటిపారుదల భూమి 113.27 లక్షల ఎకరాలు కాగా నికర నీటిపారుదల సాగు భూమి 71.71 లక్షల ఎకరాలు. తెలంగాణలో అత్యధిక నీటిపారుదల ఉన్న జిల్లాలు...జగిత్యాల (95.4%), నిజామాబాద్ (92.1%), పెద్దపల్లి (90.5%). అత్యల్ప నీటిపారుదల జిల్లాలు... కుమురంభీం (15.6%), వికారాబాద్ (22.9%), మహబూబ్‌నగర్ (27.5%).
గోదావరి పరీవాహక ప్రాంతం - ప్రాజెక్టులు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పీ): ఇది గోదావరి నదిపై తెలంగాణలో నిర్మించిన మొదటి ప్రాజెక్టు. దీని నిర్మాణాన్ని 1963 జులై 26న జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు. ఇది నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద జాతీయ రహదారి 44కు 6 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు నీరు అందిస్తారు. ఈ ప్రాజెక్టుపై మూడు ప్రధాన కాలువలు ఉన్నాయి.
కాకతీయ కాలువ: ఇది తెలంగాణలో పొడవైన ప్రధాన కాలువ. దీని పొడవు సుమారు 254 కి.మీ. ఈ కాలువ ద్వారా నిజామాబాద్ నుంచి వరంగల్‌కు నీరు అందుతుంది.
లక్ష్మీ కాలువ: దీని పొడవు 3.5 కి.మీ. ఇది నిజామాబాద్‌కు నీరు అందిస్తుంది.
సరస్వతి కాలువ: ఇది 47 కి.మీ. పొడవును కలిగి నిర్మల్, ఆదిలాబాద్‌కు నీరు అందిస్తుంది.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (కేఎల్‌ఐపీ): ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌజ్ ప్రాజెక్టు. ఇటీవల ఈ ప్రాజెక్టుపై డిస్కవరీ ఛానల్ డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించింది. ఇది భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై ఉంది. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం - 2021 ప్రకారం ప్రారంభంలో దీని ప్రాథమిక అంచనా రూ.40 వేల కోట్లు. 2020 బడ్జెట్‌లో రూ.88 వేల కోట్లు, 2021లో రూ.1.06 లక్షల కోట్లు ఉండగా, ఆలస్యం కారణంగా రూ.1.15 లక్షల కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనావేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2016లో చేపట్టి 2019 జూన్ 21న మొదటి దశను ప్రారంభించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొత్తం ఏడు లింకులు, 28 ప్యాకేజీలుగా 13 జిల్లాల ద్వారా సుమారు 500 కి.మీ. విస్తరించి 1800 కి.మీ. కంటే ఎక్కువ కాలువలను ఉపయోగించుకుంటుంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 240 టీఎంసీలు. మొత్తం 240 టీఎంసీలలో నీటిపారుదల కోసం 169 టీఎంసీలు, హైదారాబాద్ మున్సిపల్ తాగునీటి కోసం 30 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీలు, గ్రామాలకు తాగునీరు అందించేందుకు 10 టీఎంసీలు ఉపయోగించాలని నిర్ణయించగా బాష్పీభవన నష్టం 15 టీఎంసీలుగా ఉంది.
కేఎల్‌ఐపీలో ప్రధానంగా మూడు పంపింగ్ పాజెక్టులు ఉన్నాయి.
* మేడిగడ్డ - లక్ష్మీ బ్యారేజి - గోదావరి నది - భూపాలపల్లి
* అన్నారం - సరస్వతి బ్యారేజి - గోదావరి నది - భూపాలపల్లి
* సుందిల్ల - పార్వతి బ్యారేజి - గోదావరి నది - పెద్దపల్లి
కృష్ణానది పరీవాహక ప్రాంతం - ప్రాజెక్టులు
నాగార్జున సాగర్ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పీ): ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాతి ఆనకట్ట, మానవ నిర్మిత ప్రాజెక్టు. దీన్ని కృష్ణానదిపై నిర్మించారు.నల్గొండ జిల్లాలోని నందికొండ వద్ద 1955 డిసెంబరు 10న ఈ ప్రాజెక్టుకు జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. దీన్ని 1967 ఆగస్టు 4న ఇందిరా గాంధీ ప్రారంభించారు. ఇది తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పథకం. ఈ ప్రాజెక్టులో రెండు ప్రధాన కాలువలు ఉన్నాయి.
ఎడమ గట్టు కాలువ: దీన్ని లాల్‌బహదూర్ కాలువ అంటారు. దీని పొడవు 178 కి.మీ. దీని కింద నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కృష్ణా జిల్లాల్లోని 4,19,816 హెక్టార్‌లకు నీటిని అందిస్తున్నారు.
కుడి గట్టు కాలువ: దీన్ని జవహర్‌లాల్ నెహ్రూ కాలువ అంటారు. దీని పొడవు 203 కి.మీ. ఈ కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 4,75,465 హెక్టార్‌లకు నీరు అందుతుంది.
రచయిత: కొత్త గోవర్ధన్ రెడ్డి
https://tinyurl.com/54xeb6pw
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Eknath Shinde: మా కుటుంబ సభ్యులకు ఏదైనా హాని జరిగితే.. ఠాక్రే, పవార్‌దే బాధ్యత
-
Politics News
Andhra News: ప్రభుత్వ మద్యంలో ప్రాణాలు తీసే విష పదార్థాలు: తెదేపా
-
Sports News
IND vs IRL: పసికూనతో పోటీ.. టీమ్ఇండియా ఫేవరెటే అయినా..!
-
General News
Secunderabad violence: ఆవుల సుబ్బారావుకు రిమాండ్ విధించిన రైల్వే కోర్టు
-
General News
Top ten news @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
General News
AP minister suresh: మంత్రి ఆదిమూలపు సురేశ్‌కి మరోసారి అస్వస్థత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!