ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను చదివిన ప్రాథమిక ఉన్నత పాఠశాల నేడు మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలగా మారింది. నేను టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ పరీక్షలకు సంబంధించి ఓటీఆర్‌లో ఏమని నింపాలి?  

Updated : 25 Jul 2022 07:31 IST

నేను చదివిన ప్రాథమిక ఉన్నత పాఠశాల నేడు మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలగా మారింది. నేను టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ పరీక్షలకు సంబంధించి ఓటీఆర్‌లో ఏమని నింపాలి?  

- ఒక అభ్యర్థి

జ: మీ సర్టిఫికెట్లలో ఉన్నట్లు ప్రాథమిక ఉన్నత పాఠశాల అనే నమోదు చేయాలి.


నా సర్టిఫికెట్లలో అమ్మపేరు లక్ష్మి అని ఉంది. కానీ ఆమె సర్టిఫికెట్లలో శోభ అని ఉంది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌ రాసేటప్పుడు ఓటీఆర్‌లో ఆమెకు సంబంధించిన ఏ పేరును నమోదు చేయాలి?

- బంగ్లాకాడి

జ: మీ సర్టిఫికెట్లలో ఉన్న పేరునే ఓటీఆర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అమ్మ పేరును ఆమె ఆధార్‌లో కూడా లక్ష్మిగా మార్పించుకుంటే సరిపోతుంది.


నా చేతి మీద ఓం అక్షరం పచ్చబొట్టు వేసి ఉంది. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టు సాధనలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా?                

- సాయిచంద్‌

జ: ఏ సమస్యా ఉండదు. మీరు నిరభ్యంతరంగా ప్రయత్నించండి.


help@eenadupratibha.net


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని