జేఈఈ రాయకుండానే... ఐఐటీలో డిగ్రీ

ఐఐటీ మద్రాస్‌ విద్యార్థుల కోసం కొత్తగా ఓ కోర్సును తీసుకొచ్చింది. జేఈఈ స్కోరుతో పనిలేకుండానే నేరుగా తమ సంస్థలో చేరి ఆన్‌లైన్‌లో బీఎస్సీ డిగ్రీ పూర్తిచేసే అవకాశం కల్పిస్తోంది. అదీ ప్రస్తుతం ఎంతో డిమాండ్‌ ఉన్న డేటాసైన్స్‌, ప్రోగ్రామింగ్‌లో! ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం.

Updated : 15 Aug 2022 01:45 IST

ఐఐటీ మద్రాస్‌ విద్యార్థుల కోసం కొత్తగా ఓ కోర్సును తీసుకొచ్చింది. జేఈఈ స్కోరుతో పనిలేకుండానే నేరుగా తమ సంస్థలో చేరి ఆన్‌లైన్‌లో బీఎస్సీ డిగ్రీ పూర్తిచేసే అవకాశం కల్పిస్తోంది. అదీ ప్రస్తుతం ఎంతో డిమాండ్‌ ఉన్న డేటాసైన్స్‌, ప్రోగ్రామింగ్‌లో! ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం.

విద్యార్థుల నుంచి డిమాండ్‌ అధికంగా ఉన్న కారణంగా నాలుగేళ్ల బీఎస్సీగా ఈ కోర్సును ప్రవేశపెట్టారు. ఇందులో విద్యార్థులు 8 నెలల అప్రెంటిస్‌షిప్‌ లేదా ప్రాజెక్ట్‌ వర్క్‌ కూడా చేయాలి. ఈ డిగ్రీలో మల్టిపుల్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌ ఆప్షన్లు ఇస్తున్నారు. అంటే విద్యార్థి వీలునుబట్టి సర్టిఫికెట్‌, డిప్లొమా, డిగ్రీ కోర్సును చదువుకోవచ్చు. క్యాంపస్‌లకు వెళ్తూ ఇతర డిగ్రీలు చదువుతున్న వారు, ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా చదివేలా పరీక్షలు ఆదివారాల్లోనే నిర్వహిస్తారు. అర్హత కలిగిన విద్యార్థులకు వందశాతం వరకూ స్కాలర్‌షిప్‌ సౌకర్యం సైతం కల్పిస్తున్నారు. పూర్తిగా పరిశ్రమకు అవసరమైన నిపుణులను తయారుచేసేలా, ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఈ కోర్సును రూపొందించారు.

   ప్రస్తుతం ఇంటర్‌ చదువుతున్న వారితో సహా 12వ తరగతి అర్హత కలిగినవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో ఏ గ్రూప్‌ చదివిన వారైనా చేరే అవకాశం ఉంది. అయితే పదోతరగతిలో మాత్రం ఆంగ్లం, గణితం తప్పనిసరిగా చదివి ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ఠ వయసు పరిమితి లేదు. ఆన్‌లైన్‌ క్లాసులు కావడం వల్ల దేశంలో ఎక్కడి నుంచైనా చదువుకునే వీలుంది. పరీక్షలు మాత్రం కేటాయించిన కేంద్రాల్లో రాయాల్సి ఉంటుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 111 నగరాల్లో 116 పరీక్ష కేంద్రాలను ఇప్పటికే గుర్తించారు.

దరఖాస్తుకు చివరితేదీ : ఆగస్టు 19

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌: https://onlinedegree.iitm.ac.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని