కరెంట్‌ అఫైర్స్‌

‘ది ఎకనామిస్ట్‌ ఎమ్‌బీఏ ర్యాంకింగ్‌ 2022’ జాబితాలో దేశంలో మొదటి స్థానం, ఆసియాలో 5వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 75వ స్థానంలో నిలిచిన ప్రముఖ విద్యాసంస్థ ఏది?

Published : 24 Aug 2022 01:55 IST

మాదిరి ప్రశ్నలు

* ‘ది ఎకనామిస్ట్‌ ఎమ్‌బీఏ ర్యాంకింగ్‌ 2022’ జాబితాలో దేశంలో మొదటి స్థానం, ఆసియాలో 5వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 75వ స్థానంలో నిలిచిన ప్రముఖ విద్యాసంస్థ ఏది?
జ:
ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ), హైదరాబాద్‌

* 2022 సంవత్సరానికి గాను తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రకటించిన పురస్కారాల్లో పద్య/గేయ కవితా ప్రక్రియలో పురస్కారం పొందిన ఉత్తమ గ్రంథం ఏది?
జ:
తెలంగాణ రుబాయీలు (రచయిత - డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి)

* మహిళల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా తెలంగాణ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్‌ నంబరు?
జ: 94409 70000

* సౌరశక్తితో పనిచేసే ఇండోర్‌ కుకింగ్‌ స్టవ్‌ ‘సూర్య నూతన్‌’ను ఇటీవల ఏ సంస్థ తయారు చేసింది?
జ:
ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ)

* 29 కోట్ల ఏళ్లనాటి అడవి అవశేషాలను శాస్త్రవేత్తలు ఇటీవల ఏ దేశ దక్షిణ ప్రాంతంలో గుర్తించారు?
జ:
బ్రెజిల్‌

* జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరెక్టర్‌ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
జ: దినకర్‌ గుప్తా

* సరోగసీ విధానంలో పిల్లల్ని కనాలనుకునే దంపతులు అద్దె గర్భాన్ని మోసే (సరోగేట్‌ మదర్‌) మహిళకు ఎంత కాలానికి జనరల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ చేయించాలని కేంద్ర ప్రభుత్వం సరోగసీ (రెగ్యులేషన్‌) రూల్స్‌లో పొందుపరిచింది?
జ:
మూడేళ్లు

* సాధారణ వ్యక్తులతో పోలిస్తే పొగ తాగేవారిలో ఎముకలు గుల్లబారి త్వరగా విరిగిపోయే అవకాశాలు ఎంత శాతం ఎక్కువని యూనివర్సిటీ ఆఫ్‌ నెవడా, లాస్‌వెగాస్‌ (యూఎన్‌ఎల్‌వీ)తన అధ్యయనంలో వెల్లడించింది?
జ:
37 శాతం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని