కరెంట్‌ అఫైర్స్‌

తెలంగాణలో గృహహింస, వేధింపులు, దాడులు, ప్రమాదాలకు గురైన మహిళలకు తక్షణ వైద్యం, న్యాయం, ఆర్థికసాయం అందించే కేంద్రాల పేరు ఏమిటి.

Updated : 15 Oct 2022 01:10 IST

మాదిరి ప్రశ్నలు

* తెలంగాణలో గృహహింస, వేధింపులు, దాడులు, ప్రమాదాలకు గురైన మహిళలకు తక్షణ వైద్యం, న్యాయం, ఆర్థికసాయం అందించే కేంద్రాల పేరు ఏమిటి?
జ:
సఖి (వన్‌ స్టాప్‌ సెంటర్‌)

* డార్క్‌ సీక్రెట్స్‌: పాలిటిక్స్‌, ఇంట్రిగ్యూ అండ్‌ ప్రాక్సీ వార్స్‌ ఇన్‌ కశ్మీర్‌ పుస్తకాన్ని ఎవరు రచించారు?
జ:
ఇక్బాల్‌ మల్హోత్రా

* నేషనల్‌ యానిమల్‌ రిసెర్చ్‌ ఫెసిలిటీ ఫర్‌ బయో మెడికల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ను ఏ నగరంలో ఏర్పాటు చేశారు?
జ:
హైదరాబాద్‌

* వన్యప్రాణుల అభివృద్ధి, కదలికలు, సంతతి అంశాల క్రోడీకరణకు సాంకేతికత రూపొందించడం, కృత్రిమ మేధస్సు ద్వారా వివరాలను సేకరించడానికి తెలంగాణ ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్టు కింద ఏ అటవీ డివిజన్‌ను ఎంపిక చేసింది?
జ:
మంచిర్యాల జిల్లా కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌

* ఏ సంవత్సరం నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేయాలని 2022 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు?
జ:
2047

* కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం  క్షయ మరణాల్లో తెలంగాణ దేశంలో ఎన్నో స్థానంలో నిలిచింది? (ఉత్తర్‌ప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది)
జ:
15వ స్థానం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని