కరెంట్‌ అఫైర్స్‌

2022 కాళోజీ నారాయణ రావు పురస్కారం గెలుచుకున్న ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు ఎవరు? (ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా 2022, సెప్టెంబరు 9న ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

Published : 30 Oct 2022 02:39 IST

మాదిరి ప్రశ్నలు

* 2022 కాళోజీ నారాయణ రావు పురస్కారం గెలుచుకున్న ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు ఎవరు? (ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా 2022, సెప్టెంబరు 9న ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అవార్డు కింద రూ.1,01,116 నగదు, జ్ఞాపిక అందజేశారు. ‘మట్టి పొత్తిల్లు’, ‘మూలకం’, ‘రెండు దోసిళ్ల కాలం’, ‘కొండ పొదుగు పూలు’, ‘చెలిమెలు’ అనే కవిత్వ సంపుటాలు ఈయన వెలువరించారు.)  

జ: శ్రీరామోజు హరగోపాల్‌

దుబాయి ఓపెన్‌ చెస్‌ టోర్నీ-2022 విజేతగా నిలిచిన భారత గ్రాండ్‌ మాస్టర్‌ ఎవరు?                    

జ: అరవింద్‌  

తమిళనాడులోని తంజావూరు జిల్లా అరుల్మిగు వేద పురీశ్వర ఆలయంలో 62 ఏళ్ల కిందట చోరీకి గురైన నటరాజ విగ్రహాన్ని ఇటీవల ఏ నగరంలోని ఆసియా సొసైటీ మ్యూజియంలో గుర్తించారు?              

జ: న్యూయార్క్‌

తెలంగాణ విజిలెన్స్‌ కమిషనర్‌ కేఆర్‌ నందన్‌ పదవీ కాలాన్ని ఎంత కాలంపాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది?

జ: రెండేళ్లు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని