కరెంట్‌ అఫైర్స్‌

పిన్‌ కోడ్‌ (పోస్టల్‌ ఇండెక్స్‌ నంబరు) వ్యవస్థ దేశంలో అమల్లోకి వచ్చి 2022, ఆగస్టు 15 నాటికి ఎన్నేళ్లు పూర్తయ్యాయి?

Updated : 31 Oct 2022 04:22 IST

మాదిరి ప్రశ్నలు

పిన్‌ కోడ్‌ (పోస్టల్‌ ఇండెక్స్‌ నంబరు) వ్యవస్థ దేశంలో అమల్లోకి వచ్చి 2022, ఆగస్టు 15 నాటికి ఎన్నేళ్లు పూర్తయ్యాయి?

జ: 50 ఏళ్లు (1972, ఆగస్టు 15న దేశంలో పిన్‌కోడ్‌ వ్యవస్థను ప్రారంభించారు)

ఒలింపిక్స్‌-2024 ఎక్కడ జరగనుంది? 

జ: పారిస్‌, ఫ్రాన్స్‌

సౌర కుటుంబానికి ఆధారమైన సూర్యుడు ఎంత వయసు నాటికి మృత నక్షత్రంగా మారే అవకాశం ఉందని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన గయా స్పేస్‌ అబ్జర్వేటరీ ఇటీవల అంచనా వేసింది?

జ: 1.01 లక్షల కోట్ల సంవత్సరాలు (ప్రస్తుతం సూర్యుడి వయసు 457 కోట్ల ఏళ్లు)

స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా భారత్‌ సముద్ర గస్తీ మెరుగు పరుచుకునేందుకు ఏ దేశానికి డోర్నియర్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ను బహుమతిగా అందించింది?  

జ: శ్రీలంక

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అయస్కాంతాన్ని ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు

జ: చైనా

2022 కామన్వెల్త్‌ క్రీడల్లో కొత్తగా ప్రవేశపెట్టిన క్రీడలు ఏవి?                          

జ: మహిళల టీ-20 క్రికెట్‌, పారా టేబుల్‌ టెన్నిస్‌, 3 X 3 బాస్కెట్‌ బాల్‌, 3 X 3 వీల్‌ ఛైర్‌ బాస్కెట్‌ బాల్‌

రైతుల పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) లాంటి అంశాలపై సమీక్షకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు?  

జ: వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి సంజయ్‌ అగర్వాల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని