విశాలం.. వైవిధ్యం.. నిస్సారం!
ప్రపంచ భూగోళశాస్త్రం
ఇసుక, రాతిపొరలతో నిండి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే విశాల భూభాగాలే ఎడారులు. ఇక్కడ రుతువులు ఉండవు, వర్షాలు కురవవు. పచ్చదనం చాలా తక్కువ. భూములన్నీ నిస్సారం. కానీ కొన్నిచోట్ల జీవనదులు ప్రవహిస్తూ కొంతవరకు నివాసయోగ్యంగా ఉంటాయి. వీటి అంతర్భాగంలో విలువైన ఖనిజాలు ఉన్నాయి. ఇన్ని వైవిధ్య లక్షణాలున్న ఎడారులు ఏర్పడేందుకు నైసర్గిక పరిస్థితులు ఎలా కారణమవుతున్నాయి? ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఎడారుల వివరాలు, వాటి ప్రాధాన్యం, అందులో జీవుల మనుగడ, స్థితిగతులపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి.
ముఖ్యమైన భూస్వరూపాలు
ఉష్ణమండల ఎడారి శీతోష్ణస్థితిలో వివిధ భూస్వరూపాలు ఉన్నాయి.
*ఇక్కడి జీవనదులను ‘ఎక్సోటిక్’ నదులు అంటారు. సహారాలో నైలు నది, థార్ ఎడారిలో సింధూ నది, కలహరి ఎడారిలో ‘ఆరంజ్’, ఆస్ట్రేలియాలో ‘డార్లింగ్’ నదులు ముఖ్యమైనవి.
*పశ్చిమ అమెరికా, మెక్సికోల్లోని సోనారన్ ఎడారిలో కనిపించే ఉప్పునీటి సరస్సులను ‘బోల్సన్’ అంటారు.
* వర్షం కురిసే సమయంలో చేతివేళ్ల ఆకారంలో లోతైన లోయలతో కూడిన నీటి ప్రవాహాలు ఏర్పడతాయి. వీటినే ‘చెబ్కా’లు అంటారు. ఇవి లోతైన లోయల ద్వారా ప్రవహిస్తాయి. ఆ లోయలను ‘వాడీలు’ అంటారు.
* తాత్కాలిక ప్రవాహాలు భూతలంపై నిలిచి, తాత్కాలిక సరస్సులు ఏర్పడితే వాటిని ‘ప్లయాలు’ అంటారు. ఇవి ఉప్పునీటి సరస్సులు.
* ఎడారి భూతలం ఇసుక పొరతో కప్పి ఉంటే అలాంటివాటిని ‘ఎర్గ్’లు అంటారు. ఇసుక పొర లేని రాతి ఎడారులను ‘రెగ్’ లేదా ‘హమడా’ అంటారు.
సహజ వృక్షసంపద
* ‘గ్జీరోఫైటిక్’ వృక్షజాతిని కలిగి ఉండటం ఈ ప్రాంత ముఖ్య లక్షణం. అంటే ఈ ప్రాంతాల్లో పెరిగే వృక్షజాతులు బాష్పోత్సేక ప్రక్రియను నియంత్రించేందుకు అనువుగా వాటి ఆకులు చిన్నవిగా గానీ, ముళ్ల రూపంలోగాని ఉంటాయి. కాండాల చుట్టూ మందమైన మైనపు పూతలాంటి బెరడు ఉంటుంది. బ్రహ్మజెముడు, నాగజెముడు, కలబంద, రేగు, తుమ్మ, బలుస, చింత, వేప, ఈత, తాటి లాంటి వృక్షజాతులు పెరుగుతాయి.
* ఈ శీతోష్ణస్థితి ప్రాంతాల్లో మనుషుల బారి నుంచి తమను తాము రక్షించుకోడానికి అవసరమైన శరీర అనుకూలతలున్న జంతుజాతులు మాత్రమే నివసిస్తాయి. అవి ఎడారి గుంటనక్కలు, సరీసృప వర్గానికి చెందిన పాములు, తొండలు, బల్లులు, ఆర్థ్రోపొడా వర్గానికి చెందిన వివిధ రకాల చీమలు.
వ్యవసాయం - నీటిపారుదల
ఎడారి ప్రాంతాల్లో వ్యవసాయానికి సంబంధించి వివిధ రకాల నీటిపారుదల పద్ధతులు ఉంటాయి.
*ఎడారి ప్రాంతాల్లో నీటిపారుదలకు ఉపయోగించే యంత్రాలను ‘షాడుప్’ అంటారు.
* ఆస్ట్రేలియాలో ఆర్టిషియన్ బావుల ద్వారా వ్యవసాయం చేస్తారు.
* ‘బేసిన్ ఇరిగేషన్’ అంటే నైలు నది ప్రాంతంలో వరదలు సంభవించినప్పుడు ఆ వరద నీటితో పంటలు సాగు చేసే విధానం.
* ఈజిప్టులో ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీన నీటిపారుదల విధానం అభివృద్ధి చెందింది. దీనినే ‘వాడక్’ పద్ధతి అంటారు.
*ఈజిప్టులో భూఅంతర్భాగంలో నీటిపారుదల విధానాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని ‘కానక్ పద్ధతి’ అంటారు.
అయనరేఖ/ఉష్ణమండల ఎడారులు
సంవత్సరమంతా అత్యధిక ఉష్ణోగ్రత, అతితక్కువ వర్షపాతం కలిగి, మందమైన ఇసుక పొరతో నిండి, మానవ నివాసానికి అంతగా అనుకూలత లేని నిస్సార భూభాగాలను ఉష్ణమండల ఎడారులు అంటారు. ఇవి భూఉపరితల విస్తీర్ణంపై 14% మేర ఉన్నాయి.
ఉనికి: ఖండాల పశ్చిమ తీరంలో 15 నుంచి 30 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఉష్ణమండల ఎడారులు విస్తరించి ఉన్నాయి. ఇవి ఖండాల పశ్చిమ ప్రాంతాల్లో మాత్రమే విస్తరించి ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
1) వ్యాపార పవనాలతో ఖండాల తూర్పు ప్రాంతంలోనే వర్షాలు కురిసి, పశ్చిమ ప్రాంతాల్లో కురవకపోవడం.
2) పై అక్షాంశాల మధ్య ఖండాల పశ్చిమ ప్రాంతాలు
అధిక పీడన మేఖలలో ఉండటంతో ఇక్కడ గాలులు
నిమజ్జనం చెందుతాయి.
3) పై అక్షాంశాల మధ్యలోని ఖండాల పశ్చిమ ప్రాంతాలు పర్వత పరాన్ముఖ దిశల్లో ఉండటం.
4) ఖండాల పశ్చిమతీరం వెంబడి శీతల సముద్ర
ప్రవాహాలు విస్తరించి ఉండటం.
సహారా ఎడారి: ఇది ప్రపంచంలో అతిపెద్ద ఎడారి. ఆఫ్రికా ఖండంలో ఉత్తర, వాయవ్య భాగంలో తూర్పు, పడమరలుగా 3,200 కి.మీ. మేర ఉంది. మారిటానియా, మాలి, నైజర్, చాద్, సూడాన్, మొరాకో, ట్యునీషియా, అల్జీరియా, లిబియా, ఈజిఫ్ట్, ఇథియోపియా, ఎరిత్రియా, సోమాలియా దేశాల్లో విస్తరించింది.
అరేబియా ఎడారి: అరేబియా ద్వీపకల్పం (యెమెన్, ఒమన్‌లోని ఉన్నత ప్రాంతాలు మినహా) అంతటా ఉంది. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, జోర్డాన్, సిరియా,కువైట్‌లో విస్తరించింది.
ఆస్ట్రేలియా ఎడారి: ఆస్ట్రేలియా పశ్చిమ భాగంలో ఉంది. ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద, దక్షిణార్ధ గోళంలో అతిపెద్ద ఎడారి. ఆస్ట్రేలియాలో 40% భూభాగం ఎడారి ప్రాంతమే. ఇందులో గిబ్బన్, విక్టోరియన్ ఎడారులున్నాయి.
కలహరి ఎడారి: ఆఫ్రికా దక్షిణార్ధ గోళంలో నైరుతి దిశలో ఈ ఎడారి ఉంది. బోట్స్‌వానా, అంగోలా, నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల్లో విస్తరించి ఉంది.
అటకామా ఎడారి: ఆండీస్ పర్వతాలకు పశ్చిమంగా 4 నుంచి 31 డిగ్రీల వరకు ఉత్తర చిలీ, దక్షిణ పెరూలలో విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడి ఎడారి.
థార్ ఎడారి: భారత్‌లోని రాజస్థాన్‌లో, పాకిస్థాన్‌లోని సింధు ప్రాంతంలో విస్తరించి ఉంది.
సోనారన్ ఎడారి: మెక్సికో వాయవ్య ప్రాంతంలో, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కాలిఫోర్నియా, అరిజోనా రాష్ట్రాల్లో కొంత ప్రాంతంలో విస్తరించి ఉంది. మొజావే ఎడారి కూడా ఇందులోనిదే.
లక్షణాలు
* ఉష్ణమండల ఎడారుల్లో నిర్దిష్టమైన రుతువులు ఏర్పడవు. సంవత్సరమంతా అల్ప వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఈ ప్రాంత ప్రధాన లక్షణాలు.
* ఆకాశం నిర్మలంగా ఉండి, వేగంగా వీచే గాలి వల్ల ధూళి తుపానులు ఏర్పడుతుంటాయి. వీటినే ‘నైమూన్లు’ అంటారు.
* సాపేక్ష ఆర్ద్రత (గాలిలో తేమ శాతం) చాలా తక్కువ.
* ప్రపంచంలో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు ఈ ప్రకృతి సిద్ధ మండలంలోనే నమోదయ్యాయి.
* భూ ఉపరితలంపై ఇంతవరకు నమోదైన అత్యధిక పగటి ఉష్ణోగ్రత 58 డిగ్రీల సెంటిగ్రేడ్‌లు (సహారా ఎడారిలో లిబియాలోని అజిజియా వద్ద 1992, సెప్టెంబర్ 13న నమోదైంది).
* సోనారన్ ఎడారిలోని మృతలోయ (డెత్ వ్యాలీ)లో 1913, జులై 10న 56.7 డిగ్రీ సెంటిగ్రేడ్‌లుగా నమోదైంది. అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాల్లో ఇది రెండో స్థానంలో ఉంది.
* ఎడారుల్లో అత్యధిక దైనందిన ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు నమోదవుతాయి. పగలు అత్యంత వేడిగా, రాత్రి చల్లగా ఉంటుంది.
* సంవత్సరంలో అధిక ఉష్ణోగ్రతా రుతువు, అల్ప ఉష్ణోగ్రతా రుతువు అని రెండు రుతువులు ఏర్పడతాయి.
* అధిక ఉష్ణోగ్రతా రుతువులో 47 - 56 డిగ్రీ సెంటిగ్రేడ్‌లు, అల్ప ఉష్ణోగ్రతా రుతువులో 33 - 44 డిగ్రీ సెంటిగ్రేడ్‌ల వరకు మారుతూ ఉంటాయి.
* ఆసియాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం- పాకిస్థాన్‌లోని ఆకోకాబాద్ (థార్ ఎడారి). ఇక్కడ వర్షం వస్తే కుంభవృష్టిగా కురుస్తుంది.
* ప్రపంచంలో అతి తక్కువ వర్షపాతం ‘అరికా’ (అటకామా)లో నమోదవుతుంది. ఇది ప్రపంచంలో అత్యంత శుష్క ఎడారి. అందుకే ఈ పట్టణాన్ని ‘ఘోస్ట్ టౌన్’ అని పిలుస్తారు.
ఖనిజ వనరులు
ఈ మండలంలోని పలు ప్రాంతాల్లో రకరకాల ఖనిజ వనరులు లభ్యమవుతున్నాయి.
* ముడిచమురు- అరేబియన్ ఎడారి
* నైట్రేట్స్ - అటకామ ఎడారిలోని చిలీ
* బంగారం - కలహరి ఎడారిలోని విట్ వాటర్స్‌రాండ్, పశ్చిమ ఆస్ట్రేలియన్ ఎడారిలోని కాల్‌గుర్లి, కూల్‌గార్డీ
* వజ్రాలు - కలహరి ఎడారిలోని దక్షిణాఫ్రికాలో ఉన్న కింబర్లి
* వెండి - మెక్సికోలోని సోనారన్ ఎడారి
ఆదిమ జాతులు
* బుష్ మెన్ - కలహరి ఎడారి
* బిడౌనియన్స్ - అరేబియా ఎడారి
* టొరేగులు - సహారా ఎడారి
* బిడిబాలు - ఆస్ట్రేలియా ఎడారి
* మంగోలులు - గోబీ ఎడారి
ముఖ్యాంశాలు
* బిడిబాలుల ఆయుధాన్ని ‘ఉమెరాన్’ అంటారు. వీరి కుక్కలను ‘డింగ్ కుక్కలు’ అంటారు.* టొరేగుల ప్రధాన జంతువు ఒంటె. వీరికి మరొక పేరు ‘బ్లూబర్బర్స్’.* మంగోలుల ప్రధాన జంతువు ‘జడల బర్రె’.* ఎడారి ప్రాంతాల్లోని సంచార
వర్తకులను ‘కారవాన్’ అంటారు.
* నైలు నది ప్రాంతంలో వ్యవసాయదారులను ‘పెల్లాహిన్స్’ లేదా పెల్లా పాన్స్ అని అంటారు. * ఆస్ట్రేలియన్ ఎడారి ప్రాంతంలో ఆర్టీసియన్ బావుల ద్వారా వ్యవసాయం చేస్తారు. * ఉష్ణమండల ఎడారి ప్రాంతాల్లో అతిపెద్ద నగరం కైరో. * ఈ ప్రాంతంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఫీనిక్స్. ఉష్ణమండల ఎడారుల్లో అతిపెద్దది సహారా. * ఎడారుల్లో అక్కడక్కడ కనిపించే నీటి బుగ్గలను ఒయాసిస్‌లు అంటారు. ఈజిప్టు దేశాన్ని నైలు నది వరప్రసాదంగా పిలుస్తారు. * నైలు నదీ లోయ ప్రాంతం పొడుగు గింజ పత్తికి ప్రసిద్ధి.
* నైలు నదిపై ఆస్వాస్ డ్యామ్ నిర్మించడం వల్ల నాజర్ అనే కృత్రిమ సరస్సు ఏర్పడింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Belarus: ‘అమెరికా ఒత్తిడివల్లే.. రష్యా అణ్వాయుధాలకు చోటు!’
-
India News
కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్!
-
Sports News
IPL 2023: ఆర్సీబీ మార్చ్‌లో గేల్ డ్యాన్స్..కోహ్లీ అని అరుస్తూ ప్రేక్షకుల కేరింతలు
-
Movies News
Priyanka Chopra: బాలీవుడ్‌పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు.. అందుకే హాలీవుడ్‌కి వెళ్లానంటూ
-
Movies News
Social Look: ఫొటో ఎంపిక చేసుకోమన్న యషిక.. పెయింటింగ్‌ని తలపించేలా మీనాక్షి స్టిల్!
-
Politics News
DK Shivkumar: ఎన్నికల ప్రచారంలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకేఎస్.. వీడియో వైరల్