కరెంట్‌ అఫైర్స్‌

యూకేకు చెందిన రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌)లో వారెంట్‌ ఆఫీసర్‌గా నియమితులైన బ్రిటిష్‌ ఇండియన్‌ ఎవరు? (జేక్‌ ఆల్పర్ట్‌ స్థానంలో ఈ నియామకం జరిగింది.)

Published : 31 May 2023 00:13 IST

మాదిరి ప్రశ్నలు

* యూకేకు చెందిన రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌)లో వారెంట్‌ ఆఫీసర్‌గా నియమితులైన బ్రిటిష్‌ ఇండియన్‌ ఎవరు? (జేక్‌ ఆల్పర్ట్‌ స్థానంలో ఈ నియామకం జరిగింది.)

జ: మురుగేశ్వరన్‌ సుబ్బీ సుబ్రహ్మణ్యం

* ఇండియా బ్రాండ్‌ ఈక్విటీ ఫౌండేషన్‌ (ఐబీఈఎఫ్‌) తాజా నివేదిక ప్రకారం ఏ సంవత్సరం నాటికి భారత్‌ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా అవతరించనుంది?

జ: 2026

* అభివృద్ధి, శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవం-2023 (ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ స్పోర్ట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పీస్‌-2023)ను ఏప్రిల్‌ 6న ఏ థీమ్‌తో నిర్వహించారు?

జ: స్కోరింగ్‌ ఫర్‌ పీపుల్‌ అండ్‌ ది ప్లానెట్‌

* బ్యారన్స్‌ సంస్థ రూపొందించిన అమెరికా ఆర్థిక రంగంలో 100 మంది అత్యంత ప్రభావిత మహిళల జాబితా-2023లో చోటు పొందిన అయిదుగురు భారత సంతతి మహిళలు ఎవరు? (ఈ సంస్థ వరుసగా నాలుగో ఏడాది ఈ ప్రతిష్ఠాత్మక జాబితాను రూపొందించింది.)

జ: అను అయ్యంగార్‌- జేపీ మోర్గాన్‌, రూపాల్‌ జే భన్సాలి- ఏరియల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, సోనాల్‌ దేశాయ్‌- ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌, మీనాఫ్లిన్‌- గోల్డ్‌మన్‌ శాక్స్‌, సవితా సుబ్రమణియన్‌- బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా

* ఏ దేశానికి చెందిన ప్రతిష్ఠాత్మక పురస్కారం ‘ద ఆర్డర్‌ ఆఫ్‌ ద వైట్‌ ఈగల్‌’ను ఇటీవల ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెజ్‌ డుడా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీకి ప్రదానం చేశారు?

జ: పోలండ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని