కరెంట్‌ అఫైర్స్‌

2024, ఫిబ్రవరి 4 - 8 తేదీల మధ్య సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన వరల్డ్‌ డిఫెన్స్‌ షోలో భారత్‌ తరఫున పాల్గొన్న త్రివిధ దళాలకు చెందిన ముగ్గురు మహిళలు ఎవరు?

Published : 25 Mar 2024 00:12 IST

మాదిరి ప్రశ్నలు

2024, ఫిబ్రవరి 4 - 8 తేదీల మధ్య సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన వరల్డ్‌ డిఫెన్స్‌ షోలో భారత్‌ తరఫున పాల్గొన్న త్రివిధ దళాలకు చెందిన ముగ్గురు మహిళలు ఎవరు?

జ: స్క్వాడ్రన్‌ లీడర్‌ భావనా కాంత్‌ (భారత వైమానిక దళంలో ఫైటర్‌ పైలట్‌గా చేరిన మొదటి ముగ్గురు మహిళల్లో ఒకరు. ప్రస్తుతం సుఖోయ్‌ ఎస్‌యూ-30 ఫ్లీట్‌లో పైలట్‌గా పనిచేస్తున్నారు.), కల్నల్‌ పొనుంగ్‌ డోమింగ్‌ (ఈమె నాయకత్వం వహిస్తోన్న యూనిట్‌ లద్దాఖ్‌లోని డెమ్‌ చోక్‌ సెక్టార్‌లో హై ఆల్టిట్యూడ్‌ రోడ్‌ను నిర్మిస్తోంది), లెఫ్టినెంట్‌ అన్ను ప్రకాష్‌ (నావికా వైమానిక కార్యకలాపాల అబ్జర్వర్‌).


భారత్‌లో ఎంతమంది బహుముఖ పేదరికం నుంచి బయట పడినట్లు వెల్లడిస్తూ నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేష్‌ చంద్‌, సీనియర్‌ సలహాదారు యోగేష్‌ సూరి ఇటీవల ఓ చర్చాపత్రాన్ని రూపొందించారు (ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ), ఆక్స్‌ఫర్డ్‌ విధాన, మానవాభివృద్ధి సంస్థలు నివేదించిన కొన్నిఅంశాల ఆధారంగా విశ్లేషణ చేసి వీరు ఈ చర్చాపత్రాన్ని రూపొందించారు. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల్లో వెనుకబాటును బహుముఖ పేదరికం (ఎండీపీ)గా పరిగణిస్తారు. 2030నాటికి బహుముఖ పేదరికాన్ని సగానికి సగం తగ్గించాలని ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా ఉంది. పోషణ్‌ పథకం, రక్తహీనత సమస్యలు లేని భారత్‌, ఉజ్వల యోజన లాంటి వాటి వల్ల బహుముఖ పేదరికం తగ్గిందని నీతిఆయోగ్‌ చర్చాపత్రం తెలిపింది. 2013-14లో భారత్‌లో ఎండీపీ 29.17 శాతం. 2022-23లో అది 11.28 శాతానికి దిగి వచ్చినట్లు ఈ నివేదిక వెల్లడించింది.)

జ: 25 కోట్ల మంది



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని