NEET UG: రేపే నీట్‌ పరీక్ష.. అభ్యర్థులు ఇవి మరవొద్దు

NEET Exam: నీట్‌ పరీక్ష రాసే అభ్యర్థులకు డ్రెస్‌ కోడ్‌ వంటి విషయాలను గుర్తుంచుకోవాలి. లేదంటే పరీక్షా కేంద్రం వద్ద అనవసర గందరగోళానికి గురయ్యే అవకాశముంది. నీట్‌ పరీక్షకు కీలక నిబంధనలివే..

Updated : 06 May 2023 11:26 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ (NEET UG 2023) పరీక్ష ఆదివారం (మే 7) జరగనుంది. పెన్ను, పేపర్‌ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు/పట్టణాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్షకు దాదాపు 20లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారని అంచనా. మరి ఈ పరీక్ష (NEET Exam)కు హాజరయ్యే విద్యార్థులు నిబంధనలను (Instructions) మర్చిపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.

అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన కీలక విషయాలు..

పరీక్ష (NEET)కు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్‌ కార్డుతో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోను తీసుకెళ్లాలి. ఫొటోను అటెండెన్స్‌ షీట్‌పై అతికించాలి.

అభ్యర్థులు డ్రెస్‌ కోడ్‌ (Dress Code) తప్పనిసరిగా పాటించాలి. పొడవు చేతులున్న డ్రెస్సులు, షూలు, నగలు, మెటల్‌ వస్తువులను లోనికి అనుమతించరు.

స్లిప్పర్లు, తక్కువ ఎత్తున్న శాండిల్స్‌ మాత్రమే వేసుకోవాలి.

పేపర్లు, జామెట్రీ/పెన్సిల్‌ బాక్సులు, ప్లాస్టిక్‌ పౌచ్‌లు, కాలిక్యులేటర్లు, స్కేళ్లు, రైటింగ్‌ ప్యాడ్స్‌, పెన్‌డ్రైవ్స్‌, ఎలక్ట్రానిక్‌ పెన్నులు వంటి వాటిని పరీక్ష కేంద్రానికి అనుమతించరు.

చేతికి వాచ్‌లు, వాలెట్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, బెల్ట్‌లు, టోపీలు వంటివి కూడా ధరించకూడదు.

మొబైల్‌ ఫోన్లు, బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్లు, పేజర్స్‌, హెల్త్‌ బ్యాండ్స్‌, స్మార్ట్‌ వాచ్‌లు వంటి కమ్యూనికేషన్‌ డివైజ్‌లను లోనికి అనుమతించరు. ఎలక్ట్రానిక్‌ వస్తువులను కూడా తీసుకెళ్లకూడదు.

అభ్యర్థులు పరీక్ష రాసేందుకు బాల్‌ పాయింట్‌ పెన్నును పరీక్ష గదిలోనే ఇస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని