TS TET 2024: తెలంగాణ టెట్‌కు దరఖాస్తు చేశారా? ఈ ప్రాక్టీసు టెస్ట్‌ ట్రై చేయండి!

తెలంగాణలో టెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విద్యాశాఖ అధికారులు మాక్ టెస్ట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Published : 26 Apr 2024 17:37 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)-2024కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. మే 20 నుంచి జూన్‌ 3 వరకు జరగనున్న ఈ పరీక్షకు విద్యాశాఖ ప్రాక్టీస్‌ టెస్ట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.   ఈ మాక్‌ టెస్టు అభ్యర్థుల ప్రిపరేషన్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. పరీక్ష మోడల్‌ తెలియడంతో పాటు సమయ పాలన, అభ్యర్థులు తమ బలాలు, బలహీనతల్ని అంచనా వేసుకొని తమను తాము మెరుగుపరుచుకొనేందుకు ఇదో మంచి అవకాశం. ఈ మాక్‌టెస్ట్‌ను టెట్‌ వెబ్‌సైట్‌లో పొందొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా టెట్‌కు 2.83 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

మాక్‌ టెస్టులు పొందండి ఇలా..

  • తొలుత టెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • హోమ్‌ పేజీలో TS TET Mock Test-2024పై క్లిక్‌ చేస్తే ఒక విండో ఓపెన్‌ అవుతుంది.
  • సైన్‌ ఇన్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్‌ వస్తాయి. వాటిని క్షుణ్ణంగా చదివిన తర్వాత మీ ప్రాక్టీసును మొదలుపెట్టండి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని