TS Polycet Results: తెలంగాణ పాలీసెట్‌ ఫలితాలకు తేదీ ఖరారు

తెలంగాణలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలీసెట్‌ ఫలితాల విడుదలకు తేదీ ఖరారైంది.

Updated : 25 May 2023 00:32 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలీసెట్‌ ఫలితాల విడుదలకు తేదీ ఖరారైంది. ఈ నెల 26న (శుక్రవారం) ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. మొత్తం 1,05,742మంది దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. మే 17న తెలంగాణ వ్యాప్తంగా 296 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు  మొత్తంగా 98,273 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాసినట్లు అధికారులు ప్రకటించారు. అంటే  92.94 శాతం అన్నమాట. ఇందులో 54,700 మంది అబ్బాయిలు ఉండగా, 43,573 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ ఫలితాలను www.eenadu.net వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని