UGC NET 2023: యూజీసీ నెట్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదల

యూజీసీ నెట్‌ 2023 (డిసెంబర్‌) పరీక్షకు దరఖాస్తులు షురూ అయ్యాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్‌ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..

Updated : 01 Oct 2023 17:35 IST

దిల్లీ: యూజీసీ -నెట్‌(UGC-NET) డిసెంబర్‌ 2023 పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను డిసెంబర్‌ 6 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్టు జాతీయ పరీక్షల సంస్థ (NTA) వెల్లడించింది. మొత్తం 83 సబ్జెక్టుల్లో జరిగే కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT)కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఆసక్తికలిగిన అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 28 సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, పరీక్ష రుసుమును అక్టోబర్‌ 29 రాత్రి 11.50గంటల వరకు చెల్లించవచ్చని NTA పేర్కొంది. దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే అక్టోబర్‌ 30 నుంచి 31న రాత్రి 11.50గంటల వరకు సరిచేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం క్లిక్ చేయండి

పరీక్ష కేంద్రాల వివరాలను నవంబర్‌ చివరి వారంలో ప్రకటించనున్న ఎన్‌టీఏ.. డిసెంబర్‌ మొదటి వారంలో అడ్మిట్‌ కార్డులను విడుదల చేయనుంది. మొత్తం 83 సబ్జెక్టుల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు రుసుం జనరల్‌/అన్‌రిజర్వుడు రూ.1150, జనరల్‌ (ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ-ఎన్‌సీఎల్‌) అభ్యర్థులు రూ.600, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్‌ జెండర్‌ అభ్యర్థులైతే రూ.325ల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఎన్‌టీఏ పేర్కొంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని