కొవ్వులు తగ్గిస్తే రొమ్ముక్యాన్సర్‌ దూరం!

రొమ్ముక్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే కొవ్వు పదార్థాలను తగ్గించండి. రొమ్ముక్యాన్సర్‌ను ఎదుర్కోవటానికి కొవ్వులు తక్కువగా తినటం బాగా తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు సూచిస్తున్నాయి. మామూలు ఆహారం తినేవారితో పోలిస్తే- పండ్లు, కూరగాయలు, పొట్టుతీయని ధాన్యాలు దండిగా తీసుకోవటం..

Updated : 31 Dec 2018 20:40 IST

కొవ్వులు తగ్గిస్తే రొమ్ముక్యాన్సర్‌ దూరం!

రొమ్ముక్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే కొవ్వు పదార్థాలను తగ్గించండి. రొమ్ముక్యాన్సర్‌ను ఎదుర్కోవటానికి కొవ్వులు తక్కువగా తినటం బాగా తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు సూచిస్తున్నాయి. మామూలు ఆహారం తినేవారితో పోలిస్తే- పండ్లు, కూరగాయలు, పొట్టుతీయని ధాన్యాలు దండిగా తీసుకోవటం.. కొవ్వులతో కేవలం 20% కేలరీలు మాత్రమే లభించేలా చూసుకున్న మహిళలకు రొమ్ముక్యాన్సర్‌ ముప్పు 8% తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఒకవేళ రొమ్ముక్యాన్సర్‌ తలెత్తినా ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంటుండటమూ గమనార్హం. రొమ్ముక్యాన్సర్‌ బారినపడిన పదేళ్ల తర్వాత పరిశీలించగా- కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునేవారిలో 78% మందే జీవించి ఉంటుండగా.. తక్కువ కొవ్వు పదార్థాలు తినే మహిళల్లో 82% మంది హాయిగా జీవిస్తున్నట్టు తేలింది. వీరికి ఒక్క రొమ్ముక్యాన్సర్‌ మూలంగానే కాదు.. ఎలాంటి క్యాన్సర్లతోనైనా లేదా గుండెజబ్బులతోనైనా మరణించే ముప్పు సైతం తగ్గుతుండటం విశేషం. నెలసరి నిలిచిపోయిన 48,835 మంది మహిళలను దాదాపు 8 సంవత్సరాలు పరిశీలించి పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని