గుండెకు ట్రాఫిక్‌ చేటు!

గుండెజబ్బు ముప్పు కారకాలు అనగానే తగినంత వ్యాయామం చేయకపోవటం, కొవ్వు పదార్థాలు మితిమీరి తినటం వంటివే గుర్తుకొస్తాయి.

Published : 16 Apr 2019 00:27 IST

గుండెజబ్బు ముప్పు కారకాలు అనగానే తగినంత వ్యాయామం చేయకపోవటం, కొవ్వు పదార్థాలు మితిమీరి తినటం వంటివే గుర్తుకొస్తాయి. కానీ చిత్రంగా అనిపించినా ట్రాఫిక్‌ రద్దీ కూడా గుండెపోటు ముప్పు పెరగటానికి  దారితీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు ఒత్తిడి పెరిగిపోవటం దీనికి కారణం కావొచ్చని భావిస్తున్నారు. వాహనాల భారీ చప్పుళ్లు సైతం గుండెజబ్బు ముప్పు పెరగటానికి దారితీస్తున్నాయి. అందువల్ల రద్దీ వేళల్లో ప్రయాణాలు పెట్టుకోకపోవటం మంచిది. ఒకవేళ ప్రయాణం చేయాల్సి వస్తే ఒత్తిడి తగ్గించే సాధనాలు వెంట ఉండేలా చూసుకోవాలి. వాహనం ఆగిపోయినపుడు బంతిని చేత్తో నొక్కొచ్చు. మంచి సంగీతం వినొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని