నలబై దాటారా?

కొందరు.. ముఖ్యంగా 40ల్లోకి అడుగుపెట్టిన తర్వాత వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గటం లేదని చెబుతుంటారు. దీనికి ప్రధాన కారణం కండర మోతాదు తగ్గుతుండటం.

Published : 23 Apr 2019 00:27 IST

కొందరు.. ముఖ్యంగా 40ల్లోకి అడుగుపెట్టిన తర్వాత వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గటం లేదని చెబుతుంటారు. దీనికి ప్రధాన కారణం కండర మోతాదు తగ్గుతుండటం. 30 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి పదేళ్లకు 3-5% కండరాల మోతాదు తగ్గుతుంటుంది. దీంతో జీవక్రియలు మందగిస్తాయి. కండర మోతాదు ఎక్కువుంటే విశ్రాంతి తీసుకుంటున్నప్పుడూ జీవక్రియలు చురుకుగా సాగుతాయి. అంటే వ్యాయామం చేస్తున్నప్పుడే కాదు.. విశ్రాంతితీసుకుంటున్నప్పుడూ కేలరీలు ఖర్చవుతూనే ఉంటాయన్నమాట. అందువల్ల నడక వంటి వాటితో పాటు కండరాలను పెంచే వ్యాయామాల మీదా దృష్టి పెట్టటం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని