Cancer: కృత్రిమ తీపితో క్యాన్సర్ల ముప్పు

చక్కెరకు బదులు కొందరు కృత్రిమ తీపి పదార్థాలు వాడుతుంటారు. వీటిని మూలికల వంటి సహజ పదార్థాలతో గానీ చక్కెర నుంచి గానీ తయారుచేస్తుంటారు. వీటిల్లో కేలరీలు లేకపోవటం వల్ల ఇటీవల వీటి వాడకమూ పెరిగింది. కృత్రిమ తీపి పదార్థాలతో తయారైన కూల్‌డ్రింకులు,

Published : 29 Mar 2022 08:43 IST

క్కెరకు బదులు కొందరు కృత్రిమ తీపి పదార్థాలు వాడుతుంటారు. వీటిని మూలికల వంటి సహజ పదార్థాలతో గానీ చక్కెర నుంచి గానీ తయారుచేస్తుంటారు. వీటిల్లో కేలరీలు లేకపోవటం వల్ల ఇటీవల వీటి వాడకమూ పెరిగింది. కృత్రిమ తీపి పదార్థాలతో తయారైన కూల్‌డ్రింకులు, పదార్థాలను ‘సుగర్‌ ఫ్రీ’, ‘డైట్‌’ పేరుతో అమ్ముతుండటం తెలిసిందే. అయితే ఇవేమంత ఆరోగ్యకరమైనవి కావని ఫ్రాన్స్‌ అధ్యయనం పేర్కొంటోంది. కృత్రిమ తీపి పదార్థాలను పెద్ద మొత్తంలో వాడేవారికి క్యాన్సర్‌ ముప్పు 95% ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది.

ముఖ్యంగా ఆస్పర్టేమ్‌, ఏస్‌సల్ఫేమ్‌ పొటాషియం అనే కృత్రిమ తీపి పదార్థాలు బాగా హాని చేస్తున్నట్టు తేలింది. ఒక్క ఆస్పర్టేమ్‌తోనే ఊబకాయంతో ముడిపడిన మలద్వారం, జీర్ణాశయం, కాలేయం, నోరు, స్వరపేటిక, అన్నవాహిక,  అండాశయ, ఎండోమెట్రియం, ప్రోస్టేట్‌ క్యాన్సర్ల ముప్పు 15% పెరుగుతున్నట్టు తేలింది. రొమ్ముక్యాన్సర్‌ ముప్పయితే 22% ఎక్కువవుతోంది. ఏస్‌సల్ఫేమ్‌ పొటాషియం, ఆస్పర్టేమ్‌లను తక్కువ మోతాదులో తీసుకున్నా క్యాన్సర్ల ముప్పు గణనీయంగా పెరుగుతుండటం గమనార్హం. అయితే సుక్రలోజ్‌ వాడకంతో మాత్రం క్యాన్సర్ల ముప్పు బయటపడలేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని