అసలైన బహుమతి!
నగరానికి దూరంగా ఉన్న సుందరయ్య కాలనీలో సైకిల్ షాపు నడుపుతున్నాడు వీర్రాజు. కొట్టు దగ్గర్లోనే రెండు హైస్కూళ్లు ఉండడంతో చాలా మంది పిల్లలు సైకిల్ రిపేర్ల కోసం వస్తుంటారు అతని దుకాణానికి.
నగరానికి దూరంగా ఉన్న సుందరయ్య కాలనీలో సైకిల్ షాపు నడుపుతున్నాడు వీర్రాజు. కొట్టు దగ్గర్లోనే రెండు హైస్కూళ్లు ఉండడంతో చాలా మంది పిల్లలు సైకిల్ రిపేర్ల కోసం వస్తుంటారు అతని దుకాణానికి. వీర్రాజుకు పిల్లలంటే చాలా ఇష్టం. దుకాణానికి వచ్చిన పిల్లలకు.. రిపేర్ అయిపోయిన తర్వాత చాక్లెట్లు ఇస్తూ ఉండటం అతని అలవాటు. వాళ్లు తీసుకోవడానికి తటపటాయిస్తుంటే... ‘ఇవాళ నా పుట్టినరోజు’ అంటూ, తనూ వాళ్లను మొహమాటపెడతాడు. వాళ్లు ‘హ్యాపీ బర్త్‌డే’ అని చెప్పి చాక్లెట్లు తీసుకుంటూ ఉంటారు. పేద కుటుంబం నుంచి వచ్చిన వీర్రాజుకు తన పుట్టినరోజు ఎప్పుడన్నది తెలియదు.
‘గోదారి పుష్కరాల రోజుల్లో నువ్వు పుట్టావు’ అని వాళ్ల అమ్మ తన చిన్నతనంలో చెప్పిన మాట మాత్రం అతనికి గుర్తుంది. తన కొట్టు దగ్గరకొచ్చిన పిల్లలకు చాక్లెట్లు పంచాలని ఎందుకో అతనికి అనిపించింది. పిల్లలంటే అతనికున్న మమకారమే దానికి కారణం. స్పేర్‌పార్టులు కొనడం కోసం సిటీలో హోల్‌సేల్ దుకాణానికి అతను వెళ్లినప్పుడల్లా చాక్లెట్లు అమ్మే దుకాణం దగ్గర ప్యాకెట్లు తీసుకుంటూ ఉంటాడు. అదీ హోల్‌సేలే. వీర్రాజు సంగతి తెలిసిన కొట్టు యజమాని కాస్త తక్కువ ధరకే ఇస్తుంటాడు. ప్యాకెట్‌ను కత్తిరించి ఓ ప్లాస్టిక్ డబ్బాలో చాక్లెట్లను సర్ది కొట్లో ఉంచుకుంటాడు. దుకాణానికొచ్చిన పిల్లలకు వాటిని ఇస్తుంటాడు. పిల్లలు ఇష్టంగా వాటిని తింటుంటే అతనికి ఎంతో తృప్తిగా ఉంటుంది.
మొదట్లో వీర్రాజు చాక్లెట్లు ఇస్తుంటే పిల్లలు వాటిని తీసుకోవడానికి ముందుకొచ్చేవారు కాదు. తెలియని వారిచ్చే చాక్లెట్లు, బిస్కెట్లు తీసుకోకూడదని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పడం గుర్తుకొచ్చి తీసుకోవడానికి ఒప్పుకొనేవారు కాదు వారు. దాంతో పుట్టినరోజు అబద్ధం పుట్టుకొచ్చింది. ఓరోజు ఆరోతరగతి చదివే శశాంక్ వచ్చాడు వీర్రాజు దుకాణానికి. తన సైకిల్ హ్యాండిల్ బార్ ఊరికే కదిలిపోతోంది. అలాగే సైకిల్ చైను కూడా ఊడిపోతోంది. ఆ రిపేర్ల కోసం వచ్చాడు శశాంక్. పని అయిపోయిన తర్వాత డబ్బులిచ్చి, సైకిల్ ఎక్కబోతుండగా, వీర్రాజు అతని చేతిలో చాక్లెట్లు ఉంచాడు.
‘థాంక్స్’ చెప్పి... ‘అయినా.. చాక్లెట్లు దేనికి’ అని అడిగాడు. ‘నా పుట్టినరోజు ఇవాళ’ అన్నాడు వీర్రాజు నవ్వుతూ ఎప్పటిలాగానే. ‘హ్యాపీ బర్త్‌డే అంకుల్’ అన్నాడు చేయి కలుపుతూ శశాంక్. వారం తిరక్కుండానే శశాంక్ మళ్లీ వీర్రాజు దుకాణానికొచ్చాడు సైకిల్ టైర్‌కు గాలి కొట్టించుకోవడానికి. ఆ రోజు వీర్రాజు బిజీగా ఉన్నాడు. ఒకేసారి రెండు బేరాలు వచ్చాయి. ఫిట్‌నెస్ కోసం ఉదయం, సాయంత్రం కాలనీలో సైక్లింగ్ చేసే రిటైర్డ్ నేవీ ఆఫీసర్ జేమ్స్, అలాగే సైకిల్ మీద వీధివీధి తిరిగి ఇళ్లకు పాల ప్యాకెట్లు వేసే రామానుజం ఒకేసారి వచ్చారు. వాళ్ల పని మధ్యలో ఆపి, శశాంక్ సైకిల్ టైర్లకు గాలి కొట్టేసి, అలవాటు ప్రకారం చాక్లెట్లు ఇచ్చాడు వీర్రాజు.
‘ఎందుకు అంకుల్?...’ అని అడిగాడు శశాంక్. ‘నా పుట్టినరోజు’ అన్నాడు వీర్రాజు నవ్వు మొహంతో అలవాటు కొద్దీ. ‘మీ పుట్టినరోజు పోయిన వారం అయిపోయింది కదా... మళ్లీ ఇప్పుడేంటి?’ అన్నాడు శశాంక్. దొరికిపోయాననుకుంటూ అసలు సంగతి చెప్పాడు వీర్రాజు. వీర్రాజు మంచితనం, పిల్లలపై ఆయనకు ఉన్న ప్రేమను చూసి, శశాంక్ మనసు ఉప్పొంగింది. వీర్రాజును గౌరవంగా చూస్తూ, ప్రేమగా చేయి కలిపాడు. తిరిగి ఏదో బహుమతి ఇవ్వాలనుకున్నాడు శశాంక్. అమ్మను సలహా అడిగాడు. తల్లి పూర్ణిమకు కూడా కొడుకు ఆలోచన నచ్చింది. గిఫ్ట్ సెలెక్షన్‌కు ఇద్దరూ బయటకొచ్చారు. పూర్ణిమ, వీర్రాజు షాపును చూసింది. అతను ఎండలో రోడ్డు పక్కనే రిపేర్లు చేస్తూ ఉండటం గమనించింది. ఆమె బుర్రలో ఓ ఆలోచన తళుక్కున మెరిసింది. కొడుక్కి చెప్పింది. శశాంక్‌కు కూడా ఆ ఆలోచన భలే నచ్చింది.
ఇద్దరూ అక్కడికి దగ్గర్లోనే ఉన్న నర్సరీకి వెళ్లారు. ఒక బాదం మొక్కను కొన్నారు. తీరిగ్గా కూర్చుని ఉన్న వీర్రాజు, తల్లీ కొడుకులు కొట్టు వైపు రావడం చూసి లేచి నిలబడ్డాడు. అమ్మను పరిచయం చేశాడు శశాంక్. తర్వాత.. ‘అంకుల్!... పిల్లలకు ప్రేమతో చాక్లెట్లు పంచే మీకు నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. ఈ మొక్కను ఇవ్వమని మా అమ్మ సలహా ఇచ్చింది’ అంటూ కుండీని వీర్రాజు చేతిలో పెట్టాడు. ‘అయ్యో!... ఎందుకు?’’ అంటూ మొహమాటపడ్డాడు అతను. ‘‘పిల్లలకు చాక్లెట్లు పంచడం గొప్ప విషయం. అదీ పుట్టినరోజు అంటూ మొహమాటపెట్టి... మీరు తీసుకోవాలి దీన్ని. ఇది ఎదిగి మీ షాపు ముందు మంచి నీడనిస్తుంది. అప్పుడు మీ పనిని నీడలో చేసుకోవచ్చు. అలాగే రిపేర్ల కోసం వచ్చేవారికీ సౌకర్యంగా ఉంటుంది. కాదనకండి’ అని అమ్మ కలగజేసుకుని అంది. తర్వాత తల్లీ కొడుకులిద్దరూ ఇంటికి చేరారు సంతోషంగా.
ఎస్. హనుమంతరావు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
KRMB: కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించే అంశం.. కీలక సమావేశం ప్రారంభం
-
SpiceJet: ఏడు గంటల ఆలస్యంగా ఎయిర్‌పోర్ట్‌కు విమానం.. గొడవకు దిగిన ప్రయాణికులు
-
Chandrababu: దుర్గమ్మ సేవలో చంద్రబాబు దంపతులు
-
Israel Hamas: హమాస్ చర్యల వల్లే మళ్లీ గాజాలో బాంబులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా
-
T20I Record: టీ20ల్లో టీమ్ఇండియా ప్రపంచ రికార్డు..
-
Salaar: 114 రోజుల్లోనే ‘సలార్’ను పూర్తిచేశాం.. ఆసక్తికర విషయాలు పంచుకున్న ప్రశాంత్ నీల్