బ్రెడ్‌ పుడ్డింగ్‌... పసందుగా!

ఇంట్లో బ్రెడ్‌ ఉంటే... గబగబా శాండ్‌విచ్‌ లేదా బ్రెడ్‌ ఆమ్లెట్‌ చేసుకుని తినేయడంలో కొత్తేంలేదుగా. అందుకే ఈసారి కాస్త వెరైటీగా స్నాక్స్‌, స్వీట్స్‌ ప్రయత్నిద్దాం. చేసుకోవడం సులువే కాదు, రుచీ ...

Updated : 09 Dec 2022 13:02 IST

ఇంట్లో బ్రెడ్‌ ఉంటే... గబగబా శాండ్‌విచ్‌ లేదా బ్రెడ్‌ ఆమ్లెట్‌ చేసుకుని తినేయడంలో కొత్తేంలేదుగా. అందుకే ఈసారి కాస్త వెరైటీగా స్నాక్స్‌, స్వీట్స్‌ ప్రయత్నిద్దాం. చేసుకోవడం సులువే కాదు, రుచీ అదిరిపోతుంది. 


కావలసినవి: చక్కెర: ముప్పావుకప్పు, నీళ్లు: మూడుచెంచాలు, బ్రెడ్‌  స్లైసులు: నాలుగు, చిక్కని పాలు: కప్పు, కస్టర్డ్‌పౌడర్‌: మూడు చెంచాలు, కరిగించిన నెయ్యి: చెంచా.
తయారీ: ముందుగా కారమిల్‌ చేసుకోవాలి. పాన్‌లో పావుకప్పు చక్కెర, నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. చక్కెర కరిగి... పాకం గోధుమరంగులోకి మారుతున్నప్పుడు దింపేసి ఓ నెయ్యిరాసిన గిన్నెలోకి పోసుకోవాలి. పాలను ఓ గిన్నెలోకి తీసుకుని స్టౌమీద పెట్టాలి. పాలు మరుగుతున్నప్పుడు మిగిలిన చక్కెర కొద్దిగా నీటిలో కలిపి కస్టర్డ్‌పొడి వేసి బాగా కలిపి మంట తగ్గించాలి. పాలు చిక్కగా అవుతున్నప్పుడు బ్రెడ్‌పొడి వేసి కలపాలి. ముద్దలా అయ్యాక ఈ మిశ్రమాన్ని చక్కెరపాకం వేసిన గిన్నెలో వేసి పైన అల్యుమినియం ఫాయిల్‌ చుట్టేసి ఆవిరిమీద అరగంట సేపు ఉడికించి తీసుకోవాలి. ఈ మిశ్రమం చల్లగా అయ్యాక రెండుగంటలసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసుకోవాలి. 


కావలసినవి: బ్రెడ్‌స్లైసులు: పది, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, కరివేపాకు రెబ్బలు: రెండు, అల్లం: చిన్న ముక్క, జీలకర్ర: చెంచా, వేయించిన పల్లీల పొడి: మూడు చెంచాలు, బియ్యప్పిండి: అరకప్పు, పెరుగు: కప్పు, వంటసోడా: చిటికెడు, కొత్తిమీర: కట్ట, నూనె: వేయించేందుకు సరిపడా, ఉప్పు: తగినంత.
తయారీ: బ్రెడ్‌ స్లైసుల అంచుల్ని తీసేసి, ముక్కల్లా కోసుకోవాలి. వీటిపైన నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని బాగా కలపాలి. తరువాత స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. ఈ పిండిని కొద్దిగా తీసుకుని వడల్లా తట్టుకుని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండీ చేసుకోవాలి. 


కావలసినవి: బ్రెడ్‌స్లైసులు: ఎనిమిది, పనీర్‌ ముద్ద: కప్పు, మైదా: రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర: కట్ట, పాలు: ముప్పావుకప్పు, జీడిపప్పు: పావుకప్పు, అల్లం ముద్ద: చెంచా, మిరియాలపొడి: పావుచెంచా, పచ్చిమిర్చి: రెండు, కారం: పావుచెంచా,
ఉప్పు: తగినంత, దనియాలపొడి: చెంచా, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీ:ముందుగా బ్రెడ్‌స్లైసుల్ని మిక్సీలో పొడిలా చేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. మైదాలో నీళ్లు పోసి జారు పిండిలా చేసుకోవాలి. కొద్దిగా బ్రెడ్‌పొడిని విడిగా తీసుకుని మిగిలిన దాంట్లో.. ఒక్కో పదార్థాన్ని వేసుకుంటూ అన్నింటినీ కలుపుకోవాలి. ఈ పిండిని కొద్దిగా తీసుకుని ఉండలా చేసి, మొదట బ్రెడ్‌పొడిలో, తరువాత మైదా మిశ్రమంలో అద్ది... కాగుతోన్న నూనెలో వేసి వేయించుకుని తీసుకోవాలి. మిగిలిన మిశ్రమాన్ని ఇలాగే చేసుకోవాలి.


కావలసినవి: బ్రెడ్‌స్లైసులు: అయిదు, వెన్న: రెండు చెంచాలు, వెల్లుల్లి తరుగు: చెంచా, పచ్చిమిర్చి ముక్కలు: చెంచా, ఉల్లికాడల తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయముక్కలు: పావుకప్పు, క్యారెట్‌, క్యాబేజీ, క్యాప్సికం తరుగు: అన్నీ కలిపి అరకప్పు, టొమాటోలు: రెండు, పావ్‌భాజీ మసాలా: చెంచా, ఉప్పు: తగినంత, టొమాటోసాస్‌: రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర: కట్ట.
తయారీ: స్టౌమీద కడాయి పెట్టి వెన్న వేయాలి. అది కరిగాక వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లికాడల తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అన్నీ వేగాక కూరగాయ-టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు వేసి వేయించాలి. టొమాటో ముక్కలు వేగాక పావ్‌భాజీ మసాలా, టొమాటోసాస్‌ వేసి కలపాలి. రెండు నిమిషాలయ్యాక బ్రెడ్‌ ముక్కల్ని వేసి అన్నింటినీ కలిపి కొత్తిమీర చల్లి స్టౌ కట్టేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని