క్యాలరీలు తక్కువ... పోషకాలెక్కువ!

కర్బూజా తింటే... దాహం తీరడమే కాదు.. ఎండలకు శరీరం డీహైడ్రేషన్‌కూ గురికాదు. తియ్యగా ఉండే దీంట్లో రుచితోపాటుగా పోషకాలూ ఎక్కువే. అవేమిటంటే...

Updated : 04 Apr 2021 06:02 IST

పోషకాలమ్‌

కర్బూజా తింటే... దాహం తీరడమే కాదు.. ఎండలకు శరీరం డీహైడ్రేషన్‌కూ గురికాదు. తియ్యగా ఉండే దీంట్లో రుచితోపాటుగా పోషకాలూ ఎక్కువే. అవేమిటంటే...
* దీంట్లోని బీటాకెరొటిన్‌ శరీరంలో విటమిన్‌-ఎ తయారీకి తోడ్పడుతుంది. ఈ విటమిన్‌ కళ్లు, చర్మారోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు రోగ నిరోధకశక్తినీ పెంచుతుంది.
* రోజంతటికీ అవసరమైన సి విటమిన్‌ను కర్బూజా అందిస్తుంది. తరచూ జలుబూ, జ్వరాల బారినపడకుండా ఈ విటమిన్‌ తోడ్పడుతుంది.
* కర్బూజాలో పీచు పదార్థం ఎక్కువ. ఇది అధిక కొలెస్ట్రాల్‌ నియంత్రణకు, గుండె సంబంధిత వ్యాధులు రాకుండానూ కాపాడుతుంది
* దీంట్లో చక్కెర ఎక్కువగా ఉండదు. కాబట్టి మధుమేహగ్రస్తులు కూడా తీసుకోవచ్చు. అన్ని వయసుల వారూ, ఏ సమయంలోనైనా దీన్ని తినొచ్చు.
* దీంట్లోని పొటాషియం అధిక రక్తపోటు నుంచి కాపాడుతుంది. తరచూ దీన్ని తీసుకోవడం వల్ల బీపీ బారినపడకుండా ఉండొచ్చు.
* కర్బూజాలో క్యాలరీలూ తక్కువే. అధిక బరువుతో ఇబ్బందిపడేవాళ్లు దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే ఫలితం ఉంటుంది.  
* దీంట్లోని విటమిన్‌-ఎ ఎండలకు చర్మం మీద మచ్చలు పడకుండా కాపాడుతుంది. జుట్టు రాలడాన్నీ నివారిస్తుంది.
* కొంతమంది దీన్ని తినడానికి అంతగా ఇష్టపడరు. అలాంటివాళ్లు సలాడ్‌, మిల్క్‌షేక్‌ల రూపంలోనూ తీసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని