పండక్కి రేగూ, చెరకూ!
సంక్రాంతి పండగలో కొన్ని పదార్థాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సంప్రదాయం పేరు చెప్పి తిన్నా...వీటి నుంచి అందే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
రేగు: ఈ కాలంలో దొరికే రేగి పళ్లను భోగి రోజున భోగిపళ్లు పేరుతో పిల్లల తలపై పోస్తారు. ఇలా చేస్తే దిష్టి పోతుందనీ, వారికి శక్తి అంది ఆయురారోగ్యాలూ పొందుతారని నమ్మకం. అంతేకాదు రథసప్తమి రోజున జిల్లేడు ఆకుపై ఈ పండ్లను ఉంచి పెద్దలూ స్నానం చేస్తారు. నమ్మకాలు ఎలా ఉన్నా...వీటిల్లో పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, పొటాషియం, జింక్, మాంగనీస్ వంటివెన్నో వీటి నుంచి అందుతాయి. వీటిని నేరుగా తినొచ్చు. వడియాల్లానూ పెట్టుకోవచ్చు. పచ్చళ్లూ చేసుకోవచ్చు. ఎలా తిన్నా... వీటిని తినడం వల్ల రక్తహీనత అదుపులోకి వస్తుంది. ఎముకలు ఆరోగ్యంగానూ ఉంటాయి.
చెరకు: సంక్రాంతి రోజున కట్టెల పొయ్యి మీద... చేసే పొంగలిని కలబెట్టడానికి చెరకు గడలను వాడుతుంటారు. అది అదనపు రుచిని తెచ్చిపెడుతుంది మరి. ఇక, చెరకులో ఉండే పోషకాల సంగతి అంటారా...తక్షణ శక్తిని అందించడం దగ్గర నుంచి దంతక్షయం తగ్గించే వరకూ ఎన్నో. అతిదాహం, అతి వేడితో బాధపడేవారికి చెరకు చక్కటి పరిష్కారం చూపిస్తుంది. ఇందులో ఎక్కువగా ఉండే పీచు శరీరంలోని కొవ్వుని త్వరగా కరిగిస్తుంది. పిండిపదార్థాలూ, మాంసకృత్తులతో పాటు పొటాషియం, జింక్, ఫాస్ఫరస్, క్యాల్షియం వంటి ఖనిజాలూ, ఎ, బి, సి విటమిన్లూ సమృద్ధిగా ఉండటం వల్ల పోషకాలేమి సమస్య ఎదురుకాదు. దీనిలోని ఖనిజాలు దంతాలకూ, ఎముకలకూ బలాన్నిస్తే...పీచు కొలెస్ట్రాల్ స్థాయుల్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇతర పోషకాలు మూత్రపిండాలూ, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
UNSC: రష్యా చేతికి యూఎన్ఎస్సీ పగ్గాలు.. ‘చెత్త జోక్’గా పేర్కొన్న ఉక్రెయిన్!
-
General News
Hyderabad: ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తులను పరిశీలించాలి: సీఎస్ శాంతి కుమారి
-
India News
IMD: దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో.. అధిక ఉష్ణోగ్రతలే!
-
Politics News
Bandi sanjay: భారాస, కాంగ్రెస్కు తోడు సూది, దబ్బనం పార్టీలు: బండి సంజయ్ ఎద్దేవా
-
India News
Vande Bharat Express: ‘వందే భారత్ దేశ ప్రగతికి నిదర్శనం’.. మరో రైలుకు జెండా ఊపిన మోదీ
-
General News
TSPSC: ప్రశ్నపత్రం లీకేజీ కేసు.. రేణుక బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చిన నాంపల్లి కోర్టు