మోమోస్‌ అమ్మకం ఆంగ్లంలో వ్యాఖ్యానం

వీధుల్లో దొరికే తినుబండారాలంటే మనకెంతో ఇష్టం. ఘుమ ఘుమలాడే ఆ వంటకాలు రారమ్మని ఆకర్షిస్తుంటే పట్టించు కోకుండా పక్కనుంచి  వెళ్లిపోగలమా?

Updated : 03 Sep 2023 05:06 IST

వీధుల్లో దొరికే తినుబండారాలంటే మనకెంతో ఇష్టం. ఘుమ ఘుమలాడే ఆ వంటకాలు రారమ్మని ఆకర్షిస్తుంటే పట్టించు కోకుండా పక్కనుంచి  వెళ్లిపోగలమా? ఆ రుచులకు తోడు కట్టిపడేసే కామెంటరీ తోడైతే ఇక అటు వెళ్లకుండా ఉండలేం! అందుకు ప్రత్యక్ష నిదర్శనమే.. లఖ్‌నవూ ఛటోరీ గలీలో ఒక వ్యక్తి ఆంగ్లంలో మాట్లాడుతూ మోమోస్‌ అమ్మడం. ఆయన ‘వేడి వేడి మోమోస్‌.. బాదం చట్నీ, షెజవాన్‌ సాస్‌ కాంబినేషన్‌.. ఇంట్లో తయారయ్యాయి.. ఎంతో పరిశుభ్రంగా ఉన్నాయి.. వందకు పది.. తిని చూడండి.. తప్పక నచ్చుతాయి’ అంటూ ఇంగ్లిషులో వ్యాఖ్యానిస్తోంటే.. జనాలలా వాలిపోతున్నారు. మోమోస్‌ క్షణాల్లో అమ్ముడైపోతున్నాయి. ‘ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌.. సెల్లింగ్‌ మోమోస్‌’ అంటూ పోస్ట్‌ చేసిన ఈ వీడియో లక్షలాది వ్యూస్‌, లైక్స్‌తో వైరలైంది. ‘ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌ రోడ్డు మీద అమ్మడమేంటి.. సైడ్‌ బిజినెస్‌ కాబోలు.. టీచింగ్‌తో బాటు మార్కెటింగూ తెలుసన్నమాట..’ తరహాలో కామెంట్లు వెల్లువెత్తాయి. అది చూసిన మరో యూజర్‌ ‘మోమోస్‌ అమ్ముతున్న వ్యక్తి ప్రొఫెసర్‌ కాదు. వీళ్ల కుటుంబాన్ని నేను కలిశాను. అతడూ, అతడి భార్యా కూతురికి నాణ్యమైన చదువు చెప్పించేందుకు ఇలా తంటాలు పడుతున్నారు. ఇకనైనా వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా ఉందాం’ అంటూ పోస్ట్‌ చేశారు. మొత్తానికి జనాన్ని ఆకర్షించడం కోసం ఆంగ్ల వ్యాఖ్యానం బాగుంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని